అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా జార్జియాలోని డగ్లస్‌విల్లేలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు యువకులు మరణించారు. ఈ ఘటనలో మరో ఆరుగురు గాయపడినట్లు సమాచారం. శనివారం డగ్లాస్‌విల్లేలోని ఒక నివాసంలో జరిగిన హౌస్ పార్టీకి 100 మందికి పైగా హాజరయ్యారు. ఇంతలో అకస్మాత్తుగా జరిగిన కాల్పుల్లో ఇద్దరు యువకులు మరణించారు. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.
A Georgia shooting has killed two of the more than 100 teenagers who had gathered at a house party, with six others wounded, authorities said, reports AP News
— ANI (@ANI) March 6, 2023
ఇంట్లో పార్టీలో ఏం జరిగిందనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఒకరి కంటే ఎక్కువ మంది కాల్పులు జరిపారా అనేది స్పష్టంగా తెలియలేదు. శనివారం రాత్రి 10:30 నుండి 11:30 గంటల మధ్య కాల్పులు జరిగాయని డగ్లస్ కౌంటీ షెరీఫ్ కార్యాలయ అధికారి ట్రెంట్ విల్సన్ అంతర్జాతీయ వార్తా సంస్థ ది అసోసియేటెడ్ ప్రెస్‌తో చెప్పారు. ఘటనలో మరణించిన యువకుల వివరాలు కూడా వెల్లడించలేదు. అయితే వారు 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నారని చెప్పారు. డగ్లస్‌విల్లే జార్జియా రాజధాని అట్లాంటాకు పశ్చిమాన 20 మైళ్లు (32 కిలోమీటర్లు) దూరంలో ఈ ఘటన జరిగింది.