ఇద్ద‌రు ల‌ష్క‌రే ఉగ్ర‌వాదుల అరెస్ట్‌ - MicTv.in - Telugu News
mictv telugu

ఇద్ద‌రు ల‌ష్క‌రే ఉగ్ర‌వాదుల అరెస్ట్‌

October 12, 2020

జమ్మూకశ్మీర్‌లో ముష్కరుల ఏరివేత కొనసాగుతోంది. ఇంటలిజెన్స్ అధికారులు అందిస్తున్న సమాచారం మేరకు భద్రతా దళాలు, జమ్మూకశ్మీర్ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎదురుపడిన ఉగ్రవాదులను అరెస్ట్ చేస్తున్నారు. ఎదురుతిరిగిన వారిని మట్టుపెడుతున్నారు. తాజాగా ఈరోజు జరిగిన కూంబింగ్‌లో ఇద్ద‌రు ల‌ష్క‌రే తొయిబా ఉగ్ర‌వాదుల‌ను భ‌ద్ర‌తా ద‌ళాలు అరెస్ట్ చేశాయి. శ్రీన‌గ‌ర్‌లోని రామ్‌బాగ్‌లో ఓ ఇంట్లో ఉగ్ర‌వాదులున్నార‌ని భద్రతా దళాలకు సమాచారం వచ్చింది. 

భ‌ద్ర‌తా బ‌ల‌గాలు వెంటనే ఆ ఇంటిని చుట్టుముట్టాయి. దీంతో వారిపై ఉగ్ర‌వాదులు కాల్పుల‌కు పాల్ప‌డ్డారు. దీంతో  భద్రతా దళాలు కూడా కాల్పులు జ‌రిపాయి. సైనికులు ఆ ఇంటిని చుట్టుముట్టడంరో చేసేదేమిలేక ఉగ్రవాదులు లొంగిపోయారు. వారిలో ఒక‌రిని పాకిస్థాన్‌కు చెందిన సైఫుల్లాగా గుర్తించారు. మ‌రొకరిని జ‌మ్ముకు చెందిన‌వాడిగా గుర్తించారు. వారిని ల‌ష్క‌రే తొయిబాకు చెందిన ఉగ్ర‌వాదులుగా గుర్తించారు. గతంలో నౌగామ్‌లో సీఆర్పీఎఫ్ బ‌ల‌గాల‌పై జ‌రిగిన దాడిలో సైఫుల్లా పాల్గొన్నాడ‌ని క‌శ్మీర్ ఐజీ విజ‌య్ కుమార్ తెలిపారు.