జమ్మూకశ్మీర్లో ముష్కరుల ఏరివేత కొనసాగుతోంది. ఇంటలిజెన్స్ అధికారులు అందిస్తున్న సమాచారం మేరకు భద్రతా దళాలు, జమ్మూకశ్మీర్ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎదురుపడిన ఉగ్రవాదులను అరెస్ట్ చేస్తున్నారు. ఎదురుతిరిగిన వారిని మట్టుపెడుతున్నారు.
తాజాగా ఈరోజు షోపియాన్ జిల్లా చాకుర ప్రాంతంలో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు మరణించారు. భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం ఇంకా కూంబింగ్ చేస్తున్నారు.