Two were died in a fight over shaving in nanded
mictv telugu

సగం గడ్డం గీసి డబ్బులడిగిన క్షురకుడు.. పూర్తయ్యాక ఇస్తాననడంతో గొంతు కోసేశాడు

September 17, 2022

Two were died in a fight over shaving in nanded

డబ్బుల కోసం సెలూన్‌లో జరిగిన గొడవలో ఇద్దరు వ్యక్తులు హత్యకు గురయ్యారు. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ దారుణ ఘటన వివరాలిలా ఉన్నాయి. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వట్ సమీపంలోని బోధి గ్రామంలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. వెంకట్ సురేశ్ దేవ్‌కర్ అనే 22 ఏళ్ల యువకుడు గడ్డం గీసుకోవడానికి అనిల్ మారుతి షిండే కటింగ్ షాపుకి వెళ్లాడు.

అయితే సగం గడ్డం గీశాక క్షురకుడు మారుతి వెంకట్‌ను డబ్బులడిగాడు. షేవింగ్ పూర్తయ్యాక ఇస్తాననడంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. అది ముదిరి ఇద్దరూ కొట్టుకునే స్థాయికి వెళ్లింది. దీంతో కోపం పట్టలేకపోయిన క్షురకుడు మారుతి.. గడ్డం గీసే కత్తితో వెంకట్ గొంతు కోసేశాడు. తీవ్రంగా గాయపడిన వెంకట్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. విషయం తెలుసుకున్న మృతుడి బంధువులు, స్నేహితులు ఆగ్రహంతో సెలూన్ వద్దకు చేరుకొని నిప్పు పెట్టారు. పరారీలో ఉన్న అనిల్‌ను వెతికిపట్టుకొని తీవ్రంగా కొట్టి చంపారు. అతని ఇంటిని కూడా తగులబెట్టారు. రెండు వరుస హత్యలతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడగా, పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి పహారా కాశారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.