వీడియో : జేసీబీ టైరు పేలి గాల్లో ఎగిరిపడ్డ శరీరాలు.. ఇద్దరి మృతి - MicTv.in - Telugu News
mictv telugu

వీడియో : జేసీబీ టైరు పేలి గాల్లో ఎగిరిపడ్డ శరీరాలు.. ఇద్దరి మృతి

May 5, 2022

జేసీబీ (బుల్డోజర్) టైరుకు గాలి పడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు టైరు పేలి ఇద్దరు వ్యక్తులు మరణించారు. చత్తీస్ ఘడ్‌ రాయ్ పూర్ జిల్లాలోని పారిశ్రామిక వాడలో ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి టైరులో గాలి పడుతుండగా, మరో వ్యక్తి టైరు వద్దకు వచ్చాడు. గాలి పట్టిన అనంతరం ప్రెజర్ ఎంతుందో చెక్ చేస్తుండగా, ఒక్కసారిగా టైరు పేలింది. దీంతో ఇద్దరూ కూడా గాల్లో ఎగిరిపడ్డారు. మరణించిన వారు ఇద్దరు మధ్యప్రదేశ్‌కు చెందినవారు. కాగా, ఈ దృష్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.