కొత్త హెల్మెట్.. పాటలు వినొచ్చు, మాట్లాడొచ్చు - MicTv.in - Telugu News
mictv telugu

కొత్త హెల్మెట్.. పాటలు వినొచ్చు, మాట్లాడొచ్చు

April 16, 2019

ఇటీవల ఏసీ హెల్మెట్ మార్కెట్‌లో విడుదలైన సంగతి తెల్సిందే. తాజాగా బ్లూటూత్ హెల్మెట్ మార్కెట్‌లోకి వచ్చింది. దీని ద్వారా పాటలు వింటూ.. ఫోన్ మాట్లాడుతూ బైక్ డ్రైవ్ చేయవచ్చు. హెల్మెట్స్ తయారు చేయడంలో వేగ బ్రాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బ్రాండ్ హెల్మెట్లు చాలా పాపులర్. వేగా కంపెనీ ఇప్పుడు ‘ఇవో బీటీ’ పేరుతో మరో సరికొత్త బ్లూటూత్ హెల్మెట్‌ను మార్కెట్‌లో విడుదల చేస్డింది. దీని ధర రూ.2,996. ఈ హెల్మెట్‌లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. సంగీతం వినడం.. ఫోన్ మాట్లాడడంతో పాటు వాయిస్ అసిస్టెడ్ నావిగేషన్ ఫీచర్ కూడా ఉంది. ఆటోమేటిక్ కాల్ అన్సరింగ్ ఫీచర్ వల్ల ఫోన్ బటన్ కూడా నొక్కాల్సిన అవసరం లేకుండా ఫోన్ మాట్లాడచ్చు. హెల్మెట్‌లో బ్యాటరీ ఉంటుంది. చార్జింగ్ పెట్టుకోవచ్చు. ఎంత చార్జింగ్ మిగిలి ఉందో స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై చూడొచ్చు. వేగా హెల్మెట్ ఐఎస్ఐ సర్టిఫైడ్.

Two-wheeler helmet brand vega launched Bluetooth helmet.

హెల్మెట్ ప్రత్యేకతలు

మ్యూజిక్ వినొచ్చు

కాల్స్ మాట్లాడుకోవచ్చు

హ్యాండ్స్‌ఫ్రీ ఫంక్షన్

బిల్ట్‌ఇన్ రీచార్జబుల్ లి-అయాన్ బ్యాటరీ

సీఎస్ఆర్ బ్లూటూత్ చిప్

స్మార్ట్‌ఫోన్లపై పవర్ డిస్‌ప్లే

హైడెఫినేషన్ స్పీకర్లు