Two wickets in three balls.. Siraj's bowling video is viral
mictv telugu

మూడు బంతుల్లో రెండు వికెట్లు.. సిరాజ్ బౌలింగ్ వీడియో వైరల్

July 28, 2022

Two wickets in three balls.. Siraj's bowling video is viral

వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. మూడో వన్డేలో గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది. శుభమన్ గిల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌ దక్కాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 36 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది.

వర్షం పడడంతో డక్ వర్త్ లూయిజ్ ప్రకారం విండీస్ టార్గెట్ 257 పరుగులుగా నిర్ణయించారు. దీంతో లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన విండీస్.. సిరాజ్ దెబ్బకు ఆదిలోనే వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన సిరాజ్.. తొలి బంతికి కైల్ మైర్స్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. మూడో బంతికి బ్రూక్స్‌ను ఎల్బీ రూపంలో బలిగొన్నాడు. దీంతో మూడు బంతుల్లో కేవలం ఒక్క పరుగు ఇచ్చి రెండు వికెట్లు తీసినట్టయింది. దీంతో విండీస్ కష్టాల్లో పడింది. తర్వాత ఏదశలోనూ కోలుకోక 26 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌటయింది. ప్రస్తుతం సిరాజ్ వేసిన బౌలింగ్ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.