Two Women Constables Fight Of Armed Bank Robbery In Bihar
mictv telugu

బ్యాంక్‌లో చొరబడ్డ దొంగలకు చుక్కలు చూపించిన మహిళా కానిస్టేబుళ్లు

January 19, 2023

Two Women Constables Fight Of Armed Bank Robbery In Bihar

బ్యాంక్ లూటీ చేసేందుకు వచ్చిన దొంగలను రఫ్పాడించారు ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు. బ్యాంక్‌లోకి చొరబడి గేట్ వద్ద ఉన్న సెక్యూరిటీ విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లకు గన్ చూపించి బెదిరించే ప్రయత్నం చేశారు. వెంటనే తేరుకున్న ఆ ఇద్దరు.. ఆ దొంగలని అడ్డుకొని చుక్కలు చూపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బీహార్ రాష్ట్రం సెందూరి చౌక్ లోని గ్రామీణ బ్యాంకులో నిన్న(బుధవారం) ముగ్గురు దొంగలు బ్యాంకు దోపిడికి ప్రయత్నించారు. బ్యాంకులోకి వెళ్లగానే ఓ వ్యక్తి గన్ తో బెదిరించాడు. వెంటనే ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు శాంతికుమారి, జుహీ కుమారి తమ దగ్గర ఉన్న గన్‌లతో దొంగలపై ఎక్కుపెట్టారు. దీంతో వారు కానిస్టేబుళ్ళపై ఎదురు దాడి చేశారు. అయితే భయపడిన దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. ఇదంతా బ్యాంకులో అమర్చిన సీసీటీవీ కెమెరాలలో రికార్డ్‌ అయ్యింది. ఈ ఘటనలో కానిస్టేబుల్ జుహీ కుమారికి గాయాలయ్యాయి. ధైర్యంతో బ్యాంక్ దోపిడిని అడ్డుకున్న ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లను సీనియర్ పోలీస్ అధికారి ఓం ప్రకాశ్ ప్రశంసించారు. ఎలాంటి కాల్పులు జరపకుండా వారితో పోరాడారని.. కానిస్టేబుళ్లకు రివార్డ్ ప్రకటిస్తామని చెప్పారు.