Two women died from Rajahmundry in Amarnath Yatra
mictv telugu

అమర్‌నాథ్ యాత్రలో ఇద్దరు రాజమండ్రి మహిళలు మ‌ృతి

July 11, 2022

Two women died from Rajahmundry in Amarnath Yatra

పవిత్ర అమర్‌నాథ్ క్షేత్రం వద్ద విషాదం చోటుచేసుకుంది. ఈ నెల 8న గుహ వద్ద సంభవించిన వరదల్లో మరణించిన వారిలో ఇద్దరు రాజమండ్రికి చెందిన మహిళలు ఉన్నారు. సుధ, పార్వతి అనే మహిళలు మరణించగా, దీనిని అధికారులు ధృవీకరించారు. సుధ మృతదేహాన్ని ఆమె భర్త విజయ్ కిరణ్ గుర్తించారు. ఇద్దరి భౌతికకాయాలను స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీ నుంచి యాత్రకు మొత్తం 37 మంది వెళ్లగా, ఇప్పటికే 24 మంది సురక్షితంగా చేరుకున్నారు. మిగిలిన 11 మంది ప్రభుత్వ అధికారులతో టచ్‌లో ఉన్నారు. కాగా, యాత్రికుల కోసం ఏపీ ప్రభుత్వం హెల్ప్ లైన్ నెంబర్లను ప్రకటించింది.