Two women officers promoted as IGs in CRPF
mictv telugu

తొలిసారి ఐజీలుగా పదోన్నతి పొందిన మహిళా అధికారులు

November 2, 2022

సీఆర్ఫీఎఫ్ చరిత్రలో తొలిసారి ఇద్దరు మహిళా అధికారులు ఐజీలుగా పదోన్నతి పొందారు. సీమ ధుండియా, అన్నీ అబ్రమ్స్ అనే ఇద్దరు మహిళా అధికారులు ఇన్స్‌పెక్టర్ జనరల్‌గా పదోన్నతి పొందారని సీఆర్పీఎఫ్ వెల్లడించింది. సీమా ధుండియాను సీఆర్పీఎఫ్ బీహార్ సెక్టార్‌కు, అన్నీ అబ్రమ్స్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అధిపతిగా ఉంటారని వివరించింది. ఐజీ రేంజ్‌కి ఎదగడం వీరిద్దరి వల్లే సాధ్యమయిందని, వారిలోని శక్తి సామర్థ్యాలు, పనితనం, అంకితభావం చూసే పదోన్నతులు కల్పించామని సమాచారమిచ్చింది. ఇద్దరు మహిళా అధికారులు ఇప్పటికే వివిధ హోదాల్లో పని చేసి తమను తాము నిరూపించుకున్నారని ప్రశంసించింది. కాగా, ఘర్షణాత్మక ప్రాంతాల్లో, మావోయిస్టు ప్రాంతాల్లో ఆపరేషన్లు నిర్వహించే ఆయా దళాల విభాగాల్లో మహిళలు రాణించడం అరుదనే చెప్పాలి.