జంపింగ్ జపాంగ్‌లు.. 30 సెకెన్లలో వందల జంప్‌లు  - MicTv.in - Telugu News
mictv telugu

జంపింగ్ జపాంగ్‌లు.. 30 సెకెన్లలో వందల జంప్‌లు 

November 24, 2019

తాడాట.. అదేనండి జంపింగ్ రోప్… పిల్లలకు ఈజీనేకానీ పెద్దలకు కొంత కష్టమైన పనే. అందుకే దేహదారుఢ్య పరీక్షల్లో దీన్ని కూడా చేరుస్తుంటారు. అందులో తాజాగా రెండు కొత్త ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. చైనాలోని షాంఘైలో ఇటీవల నిర్వహించిన ‘6వ డబుల్ డచ్’ పోటీల్లో ఇద్దరు యువకులు పాత రికార్డులు బద్దలు కొట్టారు. 

వాంగ్ షిసెన్ అనే టీనేజ్ కుర్రాడు అరనిమిషం.. అంటే కేవలం 30 సెకన్లలో.. ఒకేమారు రెండు కాళ్లతో పైకెగురుతూ 100 జంపులు చేశాడు. సెన్ జియోలిన్ అనే మరో కుర్రోడు కాళ్లను ముందుకూ, వెనక్కీ మారుస్తూ 30 సెకన్లలౌ 228 జంపులు చేశారు. 2016లో తానే అర నిమిషంలో చేసిన 208 జంపుల రికార్డును బద్దలు కొట్టుకున్నాడు.