పిల్ల కొంచెం, రాగం ఘనం.. రేండేళ్లకే లత పాట - MicTv.in - Telugu News
mictv telugu

 పిల్ల కొంచెం, రాగం ఘనం.. రేండేళ్లకే లత పాట

December 3, 2019

Latha Mangeshkar.బాలీవుడ్ మధుర గాయని లతా మంగేష్కర్ పాటలు ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె పాటకు ఫిదా కానివారు ఎవరుంటారు చెప్పండి. అందుకే ఆమె దేశం గర్వించదగ్గ గాయని అయ్యారు. ఇటీవల కోల్‌క‌త్తా రైల్వే స్టేష‌న్‌లో రాణు మోండల్ అనే మ‌హిళ ల‌తా మంగేష్క‌ర్ పాట‌ పాడి ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. రాత్రికిరాత్రే రాణు బాలీవుడ్ గాయని అయిపోయింది. అనూహ్యంగా ఆమె జీవితమే మారిపోయింది. 

ఇదిలావుండగా లతా పాటను మరో చిన్నారి గాయని పాడింది. ఆ చిన్నారి వయసు కేవలం రెండేళ్లే. ‘ల‌గ్ జా గలే’ అనే పాట‌ని అద్భుతంగా ఆల‌పించింది. అంతచిన్న వయసులో చక్కగా గమకాలు పలికింది. ఆ పాప‌ వీడియోని జూలైలో సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా, ప్ర‌స్తుతం బాగా చక్కర్లు కొడుతోంది. ఆ చిన్నారి పేరు ప్ర‌గ్యా అని తెలుస్తోంది. పాప పాడిన పాటకు చాలామంది నెటిజన్లు ఫిదా అవుతూ లైకులు, కామెంట్లు, షేర్లతో ప్రశంసిస్తున్నారు.