two young girls crushed Eve Teaser on Valentine's Day in Maharashtra
mictv telugu

ప్రేమికుల రోజు అమ్మాయిలను గోకి చీపురు దెబ్బలు తిన్నాడు.. వీడియో

February 15, 2023

two young girls crushed Eve Teaser on Valentine's Day in Maharashtra

ప్రేమికుల రోజున అబ్బాయిలకు లవర్ లేకపోతే తన ఫ్రెండ్స్ సర్కిల్స్‌లో అవమానాలే ఎదురవుతాయి. ఆ రోజు అందరూ తమ గర్ల్‌ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తుంటే సింగిల్స్ మాత్రం విపరీతమైన నిరాశకు లోనవుతుంటారు. దీనిపై సోషల్ మీడియాలో అనేక మీమ్స్ వైరల్ అవుతుంటాయి. అయితే ఇక్కడ ఓ యువకుడు మాత్రం వాలంటైన్ డే నాడే ప్రేయసిని వెతుక్కుందామనుకున్నాడు. దారిన పోతున్న ఇద్దరు అమ్మాయిలను గోకాడు. కానీ సీన్ రివర్స్ కావడంతో వారి చేత చీపిరితో కొట్టించుకున్నాడు.

ఎంత సర్ది చెప్పినా యువతులు వినలేదు. ఓ అమ్మాయి అయితే ఏకంగా కాలితో తన్నే ప్రయత్నం చేసింది. ఇదంతా పక్కనున్న ఓ వ్యక్తి వీడియో తీసి నెట్టింట పెట్టడంతో వైరల్ అయింది. మహారాష్ట్రలోని అంబినవల్లి రైల్వేస్టేషన్ సమీపంలోని వడవాలి గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఇద్దరు యువతులు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా వీడియోలోని యువకుడు వారి వెంట పడ్డాడు. స్పందించకపోవడంతో తప్పు పదం ఒకటి పొరపాటున కూసేశాడు. దాంతో ఆగ్రహం చెందిన యువతులు అతడిని పట్టుకుని దగ్గర్లోని ఓ బెంచీపై కూర్చోబెట్టి చితకబాదారు.

అక్కడే ఉన్న ఓ మహిళ చీపురు తెచ్చివ్వగా దాంతోనే అతనికి బుద్ది వచ్చేలా తగిన శాస్తి చేశారు. అతను ఎంత సర్దిచెప్దామని ప్రయత్నించినా వినిపించుకోలేదు. పోలీసుల దృష్టికి వీడియో వెళ్లడంతో వారు స్పందించారు. ఇంతవరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. కాగా, ఈ ప్రాంతంలో తరచూ ఈవ్ టీజింగ్ కేసులు ఎక్కువయ్యాయని, పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ యువతులకు ఈవ్ టీజింగ్ పెద్ద సమస్య అనీ, సరిగ్గా బుద్ధి చెప్పారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మిగతా సింగిల్స్ మాత్రం మా బాధలు ఎప్పుడర్ధం అవుతాయోనని సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.