two Young girls driving under the influence of alcohol in delhi
mictv telugu

మద్యం మత్తులో యువతుల దుర్మార్గం.. రేంజ్ రోవర్‌తో

May 23, 2022

two Young girls driving under the influence of alcohol in delhi

ఇద్దరు యువతులు మద్యం మత్తులో కారు వేగంగా నడిపి ఓ వ్యక్తి మరణానికి కారణమయ్యారు. వివరాలు.. హరియాణాలోని అంబాలాలో ఇద్దరు యువతులు బాగా తాగి ఆ మత్తులో రేంజ్ రోవర్ కారులో బయల్దేరారు. శరీరాలపై అదుపు తప్పిన ఇద్దరు యువతులు కారును ఢిల్లీ – అమృత్ సర్ జాతీయ రహదారిపై మితిమీరిన వేగంతో పోనిచ్చారు.

ఈ క్రమంలో ధాన్యం మార్కెట్ వద్ద అదుపు తప్పి పార్క్ చేసి ఉన్న కారును గుద్దేశారు. దీంతో అందులో ఉన్న మోహిత్ శర్మ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఆయన భార్య, ఇద్దరు కుమార్తెలు గాయపడ్డారు. సమాచారం తెలిసి ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక ఎస్సైపై కూడా మద్యం మత్తులో ఉన్న యువతులు చేయి చేసుకున్నారు. దాంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్‌కి తరలించారు.