స్మార్ట్ ఫోన్ల ద్వారా కరోనా వ్యాప్తి..టవర్ల ధ్వంసం! - MicTv.in - Telugu News
mictv telugu

స్మార్ట్ ఫోన్ల ద్వారా కరోనా వ్యాప్తి..టవర్ల ధ్వంసం!

April 5, 2020

U.K. Cell Phone Towers Ablaze

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రధానమైన సమస్య కరోనా వైరస్. దీని వ్యాప్తిని అరికట్టడానికి ఎన్నో దేశాలు లాక్ డౌన్ విధించాయి. అయితే కరోనా వైరస్ వ్యాప్తి గురించి ఎన్నో తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా 5జీ స్మార్ట్ ఫోన్ల తరంగాల ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తోందని బ్రిటన్ లో ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రజలు మొబైల్ ఫోన్ టవర్లను ధ్వంసం చేశారు. టవర్ల మరమ్మతులకు వెళుతున్న సిబ్బందిపైనా దాడులు జరుగుతున్నాయి. దీంతో పోలీసులు వాళ్లకు రక్షణ కల్పిస్తున్నారు. 

ఇక ఇదే విషయమై స్పందించిన ఎన్.హెచ్.ఎస్ ఇంగ్లాండ్ నేషనల్ మెడికల్ డైరెక్టర్ స్టీఫెన్ పోవిస్, 5జీ వివాదాస్పద సిద్ధాంతం, వదంతేనని, దీని వెనుక ఎటువంటి సైంటిఫిక్ రీసెర్చ్ లేదని, ఎమర్జెన్సీని డ్యామేజ్ చేస్తే రిస్క్ పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ‘5జీ నెట్ వర్క్ లను అత్యవసర విభాగాలు, హెల్త్ వర్కర్లు, డాక్టర్లు వాడుతున్నారు. ఈ తప్పుడు వార్తలతో ప్రజలు సెల్ ఫోన్ టవర్లను ధ్వంసం చేస్తున్నారు. దీంతో మౌలిక వసతులు దెబ్బతిని, మరిన్ని సమస్యలు వచ్చేలా ఉన్నాయి. హెల్త్ ఎమర్జెన్సీపై స్పందించాల్సిన ఈ పరిస్థితుల్లో ఇటువంటి సమస్యలు వస్తే, పరిస్థితి మరింత విషమిస్తుంది’ అని పోవిస్ హెచ్చరించారు.