U.P police take prisoner shopping in a Lucknow mall.. Watch what happened next
mictv telugu

ఖైదీతో కలిసి పోలీసులు షాపింగ్..చివరికి ఏం జరిగిందంటే..వీడియో వైరల్

March 19, 2023

U.P police take prisoner shopping in a Lucknow mall.. Watch what happened next

నేరం చేసిన జైలుకు వచ్చిన ఖైదీలను వైద్యం కోసం ఆస్పత్రికి తీసుకెళ్లడం చూశాం..కానీ ఓ ఖైదీని షాపింగ్ మాల్ కు తీసుకెళ్లారు పోలీసులు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ తమతో షికార్లకు తిప్పారు. ఇది ఉత్తరప్రదేశ్ పోలీసుల చేసిన ఘనకార్యం. ఎవరికీ తెలియకుండా అలా షాపింగ్ కు వెళ్లి వచ్చేద్దం అనుకున్న పారికి సీసీకెమెరాలు షాక్ ఇచ్చాయి. ఖైదీతో పాటు షాపింగ్ చేస్తున్న పోలీసులు దృశ్యాలు ఉన్నతాధికారులకు చేరడంతో పాపం అడ్డంగా బుక్కయ్యారు ఖాఖీలు.

పూర్తి వివరాలు చూస్తే.. ఉత్తరప్రదేశ్ లోని రిషబ్ రాయ్ అనే వ్యక్తిని గత ఏడాది జూన్‎లో అక్రమ ఆయుధాలు రవాణా కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు ప్రస్తుతం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అతడికి అనారోగ్య సమస్యలు తలెత్తడంతో మార్చి 7న పోలీసులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు అనంతరం వాహనంలో ఎక్కించుకోని జైలుకు బయలు దేరారు. అయితే మధ్యలో షాపింగ్ కోసం లక్నోలోని ఓ షాపింగ్ మాల్ దగ్గర వాహనాన్ని ఆపారు. ఖైదీని వెంటబెట్టుకొని పోలీసులు షాపింగ్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన సీసీటీవీ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. పోలీసులు తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఉన్నతాధికారుల సైతం సీరియస్ అయ్యారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఎస్సై రామ్ సేవక్ సహా ముగ్గరు కానిస్టేబుళ్లను అధికారులు సస్పెండ్ చేశారు.