అమెరికా బిలియనీర్ థామస్ లీ ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆఫీస్‌లోనే తుపాకీతో కాల్చుకొని చనిపోయాడు. అమెరికా కాలమాన ప్రకారం గురువారం ఉదయం మన్ హట్టస్లోని తన కార్యాలయానికి వచ్చిన థామస్ లీ చాలా సేపటి గది నుంచి బయటకు రాలేదు. దీంతో వ్యక్తిగత సిబ్బంది పరిశీలించగా చనిపోయి ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడు తుపాకీతో కాల్చొన్నట్లు నిర్ధారించారు. సుమారు 16వేల కోట్ల సంపద ఉన్న థామస్ లీ చనిపోవడం చర్చనీయాంశమైంది. థామస్ లీ వయస్సులు ప్రస్తుతం 78 సంవత్సరాలు. ఆయన ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.
అగ్రరాజ్యంలో పేరున్న ఇన్వెస్టర్ థామస్ లీ. ఫైనాన్షియర్, ప్రైవేట్ ఈక్విటీ మార్కెట్, పెట్టుబడి వ్యాపారాల్లో ఆయన సత్తా చాటారు. దాదాపు 5 దశాబ్దాలుగా వందలాది సంస్థల్లో ఆయన 15 బిలియన్ డాలర్లకు పైటా పెట్టబడులు పెట్టారు. సంపాదించిన డబ్బును దానం చేయడంలోనూ థామస్ లీ ముందుంటారు. ది లింక్లన్ సెంటర్, మ్యూజియం అండ్ మోడ్రన్ ఆర్ట్, బ్రాండీస్ యూనవర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీ, మ్యూజియం ఆఫ్ జెవిష్ హెరిటేజ్ వంటి సంస్థల్లో ఆయన ట్రస్టీ హోదాల్లో బోర్డు సభ్యుడిగా వ్యహరించారు. కష్టాలు పేద వారికి మాత్రమే పరిమితం కాదు.. అత్యంత ధనవంతులకు కూడా కష్టాలు ఉంటాయన్నది థామస్ లీ ఆత్మహత్య ద్వారా మరోసారి నిరూపితమైంది.