డ్రైవర్లు ట్రిప్ రద్దు చేయకుండా ఉబర్ కొత్త విధానం - MicTv.in - Telugu News
mictv telugu

డ్రైవర్లు ట్రిప్ రద్దు చేయకుండా ఉబర్ కొత్త విధానం

May 21, 2022

మనం క్యాబ్ బుక్ చేసుకున్న తర్వాత, మీ డెస్టినేషన్‌కు రావడం వీలు కాదని డ్రైవర్లు చెబితే కోపమొస్తుంది. ఉబర్, ఓలా వంటి వాటిలో ట్రిప్ క్యాన్సిలేషన్ చార్జీలు కూడా వసూలు చేస్తుండడంతో ఈ సమస్య జటిలంగా మారింది. డ్రైవర్లు చివరి క్షణంలో ట్రిప్ రద్దు చేసుకోవడం వల్ల ప్రయాణికులు అనుకున్న సమయానికి గమ్యం చేరుకోలేక బస్సులు, విమానాలు మిస్ అవుతున్నారు.

ఈ సమస్యకు ఉబర్ సంస్థ పరిష్కారం చూపింది. కస్టమర్ల డెస్టినేషన్ బుకింగ్‌కు ముందే డ్రైవర్కు తెలిసే విధానాన్ని తీసుకొచ్చింది. అలాగే డబ్బును నగదుగా చెల్లించాలా, ఆన్ లైన్లో చెల్లించాలా అనే ఆప్షన్ కూడా తీసుకొచ్చింది.
ప్రస్తుతం కస్టమర్లు ఉన్న ప్రాంతానికి డ్రైవర్ వచ్చాకే గమ్యం తెలుస్తోంది. ఆ రూట్ లో వెళ్లడం ఇష్టం లేకపోతే డ్రైవర్లు ట్రిప్ రద్దు చేస్తున్నారు. ఇకపై అలా కాకుండా ముందే గమ్యం తెలియనుండంతో డ్రైవర్లు దాన్ని యాక్సెప్ట్ చేయాలో లేదో ముందే నిర్ణయించుకోవచ్చు. దీని వల్ల సమయం ఆదా కావడమే కాకుండా, రద్దు చార్జీల బాధ కూడా ఉండదు.