ఉబర్‌లో మరో ఫీచర్.. మీ ప్రయాణం మరింత సురక్షితం - MicTv.in - Telugu News
mictv telugu

ఉబర్‌లో మరో ఫీచర్.. మీ ప్రయాణం మరింత సురక్షితం

November 22, 2019

క్యాబ్ సేవల్లో ప్రయాణికుల సేఫ్టీ కోసం ఉబెర్ మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. వాయిస్ ఆడియో రికార్డింగ్ ఆప్షన్‌ను తీసుకువచ్చారు. కొన్నిసార్లుడ్రైవర్లు ప్రయాణికుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ ఫిర్యాదులు వస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు మహిళలకు రక్షణ కల్పించడం, లైంగిక వేధింపులు జరగకుండా ఉండటంతో కోసం ఈ ఫీచర్స్ చేర్చారు. ప్రస్తుతం దీనిపై టెస్టింగ్ ప్రారంభించనున్నారు. 

Uber.

దీని ద్వారా ప్రయాణ సమయంలో ప్రయాణికులు, డ్రైవర్ మధ్య జరిగే సంభాషణలను ఎప్పటికప్పుడు రికార్డు చేసుకోవచ్చు.. దీన్ని ముందుగా ప్రయోగాత్మకంగా వచ్చే నెల నుంచి లాటిన్‌ అమెరికా దేశాల్లో  ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత మిగితా దేశాల్లోనూ అందుబాటులోకి రానుంది. ప్రయాణికులకు, డ్రైవర్‌ మధ్య ఇబ్బందులు, ఘర్షణ జరిగితే ఆ ఆడియో పోలీసులకు అందజేయడం కోసం భద్రపరచనున్నారు. దీని ద్వార తమ యూజర్లు మరింత ధైర్యంగా ప్రయాణం చేయవచ్చని ఆ సంస్థ పేర్కొంది. కొత్త ఫీచర్‌పై సానుకూల స్పందన వస్తే వచ్చే కొన్ని రోజుల్లో మనదేశలో కూడా ఈ సేఫ్టీ ఫీచర్ వస్తుంది.