ప్రయాణీకులకు షాక్.. క్యాబ్ ధరలను పెంచిన ఉబర్ - MicTv.in - Telugu News
mictv telugu

ప్రయాణీకులకు షాక్.. క్యాబ్ ధరలను పెంచిన ఉబర్

April 12, 2022

uuu

ప్రముఖ క్యాబ్ సర్వీసుల సంస్థ ఉబర్ క్యాబ్ సర్వీసులు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దాదాపు 12 శాతం పెంపును ప్రస్తుతానికి ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధికి వర్తిస్తుందని తెలిపింది. కొద్ది రోజుల క్రితమే ముంబై, హైదరాబాదులలో 15 శాతం ఛార్జీలను పెంచినట్టు ఉబర్ ప్రకటించింది. త్వరలో బెంగళూరు, చెన్నై నగరాల్లో పెంపు ఉంటుందని తెలిపింది. ఇంధన ధరలు ఇలాగే పెరిగితే మరోమారు క్యాబ్ ధరలను సవరించక తప్పదని వెల్లడించింది. కాగా, ఇటీవల పెరుగుతున్న ఇంధన ధరలకనుగుణంగా రేట్లను పెంచాలంటూ డ్రైవర్లు నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, రేట్లు పెంచినా కూడా క్యాబ్ డ్రైవర్లు ఏసీ కోసం ప్రత్యేక రుసుమును వసూలు చేస్తున్నారు. ఏసీ ఆన్ చేయమని ప్రయాణీకులు కోరితే వారి నుంచి రూ. 50 నుంచి వంద వరకు వసూలు చేస్తున్నారు. ఈ నిర్ణయం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఇందుకనుగుణంగా వివరాలు తెలిపేలా బోర్డులను ఏర్పాటు చేశారు.