Udaipur Murder Accused Attacked By Angry Crowd Outside Court In Jaipur | Video
mictv telugu

ఉదయ్‌పూర్ నిందితులపై కోర్టు వద్ద దాడి.. వీడియో

July 2, 2022

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన టైలర్‌ కన్హయ్య లాల్‌ తల నరికి దారుణంగా హత్య చేసిన కిల్లర్స్‌పై కోర్టు వద్ద జనం దాడి చేశారు. నిందితుల దుస్తులు చింపేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు హంతకులను వెంటనే వ్యాన్‌లో ఎక్కించి అక్కడి నుంచి తరలించారు.

ప్రస్తుతం ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) దర్యాప్తు చేస్తోంది. దానిలో భాగంగా ఈ కేసుకు సంబంధించిన నలుగురు నిందితులను అధికారులు జైపూర్‌లోని ఎన్‌ఐఏ కోర్టులో హాజరుపర్చారు. ఈ క్రమంలో కోర్టు ప్రాంగణంలో భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అక్కడే గుమిగూడిన ప్రజలు వీరిపై దాడికి పాల్పడ్డారు. వారిని కొట్టి, వారి దుస్తులను చించేశారు. న్యాయవాదులు నిందితులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉరి శిక్ష విధించాలని డిమాండ్‌ చేశారు.

నుపుర్‌ శర్మకు మద్దతుగా సోషల్‌ మీడియాలో పోస్టులు చేసిన కన్హయ్య లాల్‌ ను రియాజ్ అఖ్తరీ, గోస్ మొహమ్మద్ అనే ఇద్దరు వ్యక్తులు మంగళవారం దారుణంగా కన్హయ్య తల నరికి హత్య చేశారు. హత్య అనంతరం బైక్‌పై పారిపోతున్న వారిని రాజస్థాన్‌ పోలీసులు చాకచక్యంగా అడ్డుకుని అరెస్ట్‌ చేశారు. అలాగే కన్హయ్య టైలర్‌ షాపు వద్ద రెక్కీకి సహకరించిన మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు