ఇకపై సినిమాలు చేయను: ఉద‌య‌నిధి స్టాలిన్‌ - MicTv.in - Telugu News
mictv telugu

ఇకపై సినిమాలు చేయను: ఉద‌య‌నిధి స్టాలిన్‌

May 15, 2022

తమిళ హీరో, నిర్మాత ఉద‌య‌నిధి స్టాలిన్ సంచలన ప్రకటన చేశాడు. ‘ఇక‌పై నేను సినిమాలు చేయ‌ను. పూర్తిగా రాజ‌కీయాల్లోనే ఉంటా’ అని ఆయన తాజాగా నటించిన ‘నెంజుకు నిధి’ చిత్ర ప్ర‌మోష‌న్స్‌లో ప్రకటన చేశారు. త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడుగా ఓవైపు బాధ్యతలు నిర్వహిస్తూ, మరోవైపు నిర్మాతగా, హీరోగా మంచి పేరును సంపాదించుకున్నారు.

త‌మిళ‌నాడులో ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో డీఎంకే త‌ర‌ఫున ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘన విజ‌యం సాధించారు. త‌న సినీ కెరీర్‌లో ‘మామ‌న్న‌న్’ సినిమానే త‌న‌కు తుది సినిమా అని ప్ర‌క‌టించిన ఆయ‌న‌..ఆదివారం ఇక‌పై త‌న తండ్రితో క‌లిసి పూర్తిగా ప్ర‌జా సేవలోనే కొన‌సాగుతానని ప్ర‌క‌టించారు.

ఉదయనిధి స్టాలిన్, రెడ్‌జైంట్ మూవీస్ పతాకంపై 2008లో విజయ్, త్రిష హీరోహీరోయిన్లుగా ‘కురువి’ చిత్రం నిర్మించి, నిర్మాతగా సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత 2009లో ఆధవాన్, 2010లో మన్మధన్ అంబు, 2010లో 7th సెన్స్ చిత్రాలను నిర్మించాడు. అతను 2012లో ఓరకల్ ఓరు కన్నడి (తెలుగులో ఒకే..ఒకే ) చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యాడు.