ఉద్ధవ్‌కు ఈడీ సెగ.. బావ ఆస్తులు సీజ్ - MicTv.in - Telugu News
mictv telugu

ఉద్ధవ్‌కు ఈడీ సెగ.. బావ ఆస్తులు సీజ్

March 22, 2022

hbgfb

మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేకు ఈడీ షాకిచ్చింది. ఆయన బావ శ్రీధర్ పటంకర్‌కు చెందిన 6 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జప్తు చేస్తూ ఈడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనకు చెందిన కంపెనీకి థానే జిల్లాలోని నీలాంబరి ప్రాజెక్టులో ఉన్న 11 ఫ్లాట్లను కూడా సీజ్ చేసింది. అయితే ఏ కేసు కింద ఈడీ ఆస్తులను సీజ్ చేసిందో వివరాలు బయటికి రాలేదు. ఇదికాక, ఇటీవలే ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య ఠాక్రే స్నేహితులకు చెందిన ఇళ్లలో ఆదాయ పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. కాగా, ఇప్పటికే మహా అఘాడి నేతృత్వంలో మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో బీజేపీ, శివసేనల మధ్య దూరం పెరిగింది. తాజా చర్యతో కేంద్రంలోని బీజేపీ శివసేనను కావాలనే ఇరుకున పెట్టేందుకు దాడులు నిర్వహిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి.