వినండహో.. సీఎంకు కారు లేందట, ఆస్తులేమో రూ. 143 కోట్లంట
ఈ రోజుల్లో చిన్నపాటి ఉద్యోగాలు చేసేవారు సైతం సొంత వాహనాలను కొనుక్కుంటున్నారు. కానీమహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే వేసిన నామినేషన్ అఫిడవిట్‌లో అందరిని ఆశ్చర్యపోయే అంశాలు వెలుగు చూశాయి. ఆయనకు సొంత కారు కూడా లేదని అందులో పేర్కొన్నాడు. ఈ విషయం తెలిసి అంతా ఆశ్చర్యపోయారు. సీఎం, ఓ పార్టీ అధినేతగా ఉన్న ఉద్దవ్‌కు కారులేకపోవడం ఏంటని అనుకుంటున్నారు.
సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఉద్దవ్ థాక్రే శాసన సభ, లేదా మండలిలో సభ్యుడై ఉండాలి. దీంతో అక్కడ శాసనసభ్యుల కోటాలో 9 ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 21న ఎన్నికలు జరగనున్నాయి. దీంతో తొలిసారి శివసేన అధినేత ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈ సందర్భంగా ఆయన తన ఆస్తుల వివరాలను ఎన్నికల సంఘం అధికారులకు సమర్పించారు. అందులో తనకు రూ.76.59 కోట్ల వ్యక్తిగత ఆస్తులు ఉన్నట్టు తెలిపారు. కుటుంబం మొత్తం ఆస్తులు రూ.143.26 కోట్లుగా సీఎం పేర్కొన్నారు. తనకు సొంతంగా రూ.4.06 కోట్ల కుటుంబానికి రూ.15.50 కోట్లు అప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. సొంత కారు కూడా లేదని అందులో పేర్కొనడం అందరిని ఆశ్చర్యపరిచింది.