కంగనాపై ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర విమర్శలు - MicTv.in - Telugu News
mictv telugu

కంగనాపై ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర విమర్శలు

October 26, 2020

maharashtra

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ మధ్య ఇంకా వివాదం కొనసాగుతోంది. తాజాగా శివసేన దసరా ర్యాలీలో ఉద్ధవ్ ఠాక్రే.. కంగనాపై విమర్శలు గుప్పించారు. అలాగే బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకుంటే, హత్య అని ప్రచారం చేశారంటూ ఎద్దేవా చేశారు. అలాగే తన తనయుడు ఆదిత్యను అనవసరంగా సుశాంత్ కేసులోకి లాగి దుర్భాషలాడారని ఆరోపించారు.

న్యాయం తమవైపే ఉందని తెలిపారు. బతుకు దెరువు కోసం వచ్చి కొందరు ముంబైని పీఓకెతో పిలుస్తున్నారని మండిపడ్డారు. తాము ఇంట్లో తులసి మొక్కలు పెంచుతాం, గంజాయి కాదు… ఈ విషయం వారికి తెలియదు అంటూ కంగనాపై తీవ్ర విమర్శలు చేశారు. గంజాయి వాళ్ల రాష్ట్రంలో పండుతుందని పేర్కొన్నారు. వారు నమ్మకద్రోహలు మిగిలిపోతారన్నారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తరువాత, కంగనా ముంబైని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)తో పోల్చడం వివాదం రేపింది.