రండి.. కూర్చొని మాట్లాడుకుందాం.. రెబల్స్‌కు ఉద్ధవ్‌ విజ్ఞప్తి - MicTv.in - Telugu News
mictv telugu

రండి.. కూర్చొని మాట్లాడుకుందాం.. రెబల్స్‌కు ఉద్ధవ్‌ విజ్ఞప్తి

June 28, 2022

Uddhav Thackeray's BIG MESSAGE to rebel Shiv Sena MLAs: 'Return to Mumbai, talk to me'

మహారాష్ట్రలో తీవ్ర రాజకీయ సంక్షోభం క్షణం క్షణం ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. తాజాగా రెబల్ ఎమ్మెల్యేలకు శివసేన అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కీలక విజ్ఞప్తి చేశారు. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా వెనక్కి తిరిగి రావాలని కోరారు. ఒక కుటుంబ పెద్దగా రెబల్ క్యాంప్ పట్ల తాను ఆవేదనతో ఉన్నట్టు ఆయన తెలిపారు. ఈ మేరకు రెబల్ ఎమ్మెల్యేలకు ఆయన మంగళవారంనాడు ఒక బహిరంగ లేఖ రాశారు.

లేఖలో.. “ మీలో చాలా మంది మాతో టచ్‌లో ఉన్నారు.. మీరంతా శివసేన గుండెల్లో ఉన్నారు. రండి.. కూర్చొని మాట్లాడుకుందాం.. అప్పుడే ఈ సమస్యకు ఓ పరిష్కారం దొరుకుతుంది. సమయం ఇంకా మించిపోలేదు. తాజా పరిణామాలతో శివసైనికులు, ప్రజల్లో ఏర్పడిన అనేక సందేహాలను తొలగించాలి. ఎవరి మాటలకూ లొంగిపోవద్దు. శివసేన మీకు ఇచ్చిన గౌరవం మరెక్కడా దొరకదు. మీరు వచ్చి నాతో మాట్లాడితేనే ఏదో ఒక పరిష్కారం లభిస్తుంది. ఒక పార్టీ అధ్యక్షుడిగా, కుటుంబ పెద్దగా మీ అందరి పట్ల నేను ఆందోళనతో ఉన్నా’’ అని ఉద్ధవ్‌ పేర్కొన్నారు.

మరోవైపు.. గౌహతిలో శివసేన రెబల్‌ ఎమ్మెల్యేల కీలక సమావేశం జరిగింది. ఉద్ధవ్‌ ఠాక్రే సర్కార్‌కు మద్దతు ఉపసంహరణ, అసెంబ్లీలో విశ్వాసపరీక్షపై ఏక్‌నాథ్ షిండే వర్గం చర్చలు జరుపుతోంది.