భారతదేశం తరపునుంచి ప్రయోగించబడిన తొలి ఉపగ్రహం “ఆర్యభట్ట” మేధావి ఇకలేరు, ఇస్రో మాజీ ఛైర్మన్ ఉడుపి రామచంద్రారావు(యు.ఆర్.రావు) (85) బెంగళూరులోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు, హృద్యోగ సమస్యల కారణంగా ఈ ఏడాది మొదట్లో ఆయన ఆసుపత్రిలో చేరారు.భారత తొలి వాహననౌక ఆర్యభట్ట రూపకల్పనలో యూ.ఆర్.రావు కీలక పాత్ర పోషించారు.ఆయన పలు జాతీయ,అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు, 1932 కర్ణాటకలోని అడమరులో జన్మించిన యూ.ఆర్.రావు 1976లో పద్మభూషణ్, 2017లో పద్మ విభూషణ్ అందుకున్నారు. 1984-94 కాలంలో ఇస్రో చైర్మన్గ పనిచేశారు, ఇస్రో చైర్మన్గా పలు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు చేపట్టి ఇస్రోకు ఎనలేని సేవలందించారు. దేశీయ తొలి ఉపగ్రహం ఆర్యభట్ట రూపశిల్పిగా రామచంద్రారావు భారతదేశానికి ఎంతో గుర్తింపు తీసుకొచ్చారు.