ఉగాది నిండుగా..  ఇలా శుభాకాంక్షలు చెప్పండి  - MicTv.in - Telugu News
mictv telugu

ఉగాది నిండుగా..  ఇలా శుభాకాంక్షలు చెప్పండి 

March 25, 2020

Happy-ugadi-wishes-1

ఉగాది అంటే యుగానికి ఆది అనే అర్థం వస్తుంది. తెలుగు వారికి ఇది గొప్ప పండగ. తెలుగు సంవత్సరాని ఆరంభంగా ఉగాదిని చెబుతారు. ఇది అచ్చమైన పకృతి పండగ. ఈ పండగను ష‌డ్రుచుల  సమ్మేళనంగా పిలుస్తారు. ఆ రోజు ఉగాది ప‌చ్చ‌డి,పిండివంట‌లు, మామిడి తోరణాలతో తెలుగు లోగిళ్లు అన్ని కళకళలాడుతాయి. ప్రతి సంవత్సరం ఉగాది పండగ ఎంతో కొత్తగా అనిపిస్తుంది. వికారి నామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త ఏడాది శార్వరి నామ సంవత్సరానికి ఘన స్వాగతం పలకండి. ఈ ఏడాది కూడా కొత్త జరుపుకోండి. మీ మిత్రులకు ఈ కొటేషన్లతో శుభాకాంక్షలు తెలపండి.

  1. తీపి చేదు కలిసిందే జీవితం. కష్టం సుఖం తెలిసిందే జీవితం.ఆ జీవితంలో ఆనందోత్సాహాలు పూయించేందుకు వస్తుంది ఉగాది పండగ శార్వరి నామ సంవత్సర శుభాకాంక్షలు.

  1. జీవితం సకల అనుభూతుల మిశ్రమం స్థితప్రజ్ఞత అలవరచుకోవడం వివేకి లక్షణం అదే ఉగాది తెలిపే సందేశం శార్వరి నామ సంవత్సర శుభాకాంక్షలు .

 

  1. మధుర మైన ప్రతిక్షణం నిలుస్తుది జీవితం రాబోతున్న కొత్త సంవత్సరం అలాంటి క్షణాల్ని ఎన్నో ఇవ్వాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు.

 

  1. వెలుగుల హారతి. తెలుగు వారి కొత్తవెలుగుల కాంతి. వచ్చేనమ్మా ఉగాది.

  1. మామిడి పువ్వుకు మాట వచ్చింది, కోకిలకు గొంతుకు కూత వచ్చింది,వేప కొమ్మకు పువ్వు వచ్చింది,పసిడి బెల్లం తోడు వచ్చింది,గుమ్మానికి పచ్చని తోరణం వచ్చింది, పండగ మన ఇంటి ముందుకు వచ్చింది. మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు 

 

  1. ప్రకృతిని పులకింపు చేసేది చైత్రం, మనల్ని పలకరించేది మన స్నేహం,షడ్రుచుల కలభోత మన బంధం,అనుభూతులతో నిత్య నూతనం.

  1. వసంతం మీ ఇంట రంగవల్లులు అద్దాలి,కోకిల మీ అతిథిగా రావాలి, కొత్త చిగురులు ఆశల తోరణాలు కట్టాలి… మీకు మీ కుటుంబ సభ్యులకు శార్వరి నామ సంవత్సర శుభాకాంక్షలు.