ఉగాది పచ్చడిని తయారు చేస్తున్నారా? ఈ విషయాలు తెలుసా?  - MicTv.in - Telugu News
mictv telugu

ఉగాది పచ్చడిని తయారు చేస్తున్నారా? ఈ విషయాలు తెలుసా? 

March 25, 2020

జీవితం పూలపాన్పు కాదు. ముళ్లు కూడా ఉంటాయి. వాటిని తీసేయాలి. నల్లులు కూడా ఉంటాయి.. వాటిని నలిపేయాలి. జీవిత తీపిచేదు రచుల సంగమం. ఇది మాటలతో చెబితే అర్థమయ్యేది కాదు. అందుకే ఉగాది పండగ పచ్చడి రూపంలో దీన్ని చక్కడా బోధిస్తుంది. 

ఏ పండుగలోనైనా ఆయాకాలాలను అనుసరించి తయారుచేసే కొన్ని సాంప్రదాయక వంటకాలు ఉంటాయి. ఉగాది రోజున షడ్రుచులు కలిసిన పచ్చడిని తీసుకుంటారు. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడిని పర్వదినాన విధిగా తీసుకుంటారు. పచ్చడి సంవత్సరం అంతా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఇస్తుంది.

 

పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు…

 

* మామిడికాయ – 1,

* వేప పువ్వు- 1/2 కప్పు,

* సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు- 1/2 కప్పు,

* కొత్త చింతపండు- 100 గ్రాములు,

* కొత్త బెల్లం- 100 గ్రాములు,

* మిరపకాయలు- 2,

* అరటిపండు – 1,

* చెరకు రసం -1/2 కప్పు,

* ఉప్పు – సరిపడేంత,

* నీళ్లు – సరిపడేంత.

 

కొందరు అరటి పళ్లు, జామకాయలు కూడా వేస్తారు.

 

తయారు చేసే విధానం….

ముందుగా వేపపువ్వును కాడల నుంచి వేరు చేయాలి. చింతపండులో కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టి పది నిమిషాల తర్వాత దాని గుజ్జును తీయాలి. మామిడికాయను, మిరపకాయలు, కొబ్బరిని సన్నగా కోయాలి. తర్వాత చెరకు రసం సిద్ధం చేసి, మిగతా పళ్లను వాటిని కూడా సన్నగా చేసి పెట్టుకోవాలి. బెల్లాన్ని కూడా తురిమి పెట్టుకొని దాన్ని చింతపండు గుజ్జులో కలపాలి. దాంట్లో మామిడి కాయ ముక్కలు, తరిగిన కొబ్బరి, మిరపకాయ ముక్కలను వేసి చివరిగా సరిపడా ఉప్పు వేసి కలుపుకోవడంతో ఉగాది పచ్చడి తయారవుతోంది. ఈ పచ్చడిని వసంత లక్ష్మీని ఆహ్వానించి, నైవేద్యంగా సమర్పించి, తర్వాత కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు స్వీకరించాలి.

 

పచ్చడి తయారీలో వాడే పదార్థాలతో ఆరోగ్యం..

వేప పువ్వు: ఇందులో రోగ నిరోధక గుణమున్నది. ఋతుమార్పు వల్ల పిల్లలకు ఆటలమ్మ, స్పోటకం, కలరా, మలేరియా సోకకుండా వేప నిరోధిస్తుంది. గుమ్మానికి వేపాకులు కట్టి, వేపపువ్వును పచ్చడిలో వేయడం వల్ల రక్తాన్ని శుద్ధిచేసి వాతపిత్త కఫాన్ని నిర్మూలించే సమవూపకృతి ఏర్పడుతుంది.

 

బెల్లం: దీనిలోని ఔషధ గుణాల వల్ల ఆయుర్వేదంలో చాలా మందులకు దీనిని అనుపానంగా వాడతారు. గురుడు పూర్తిగా శుభక్షిగహం కావడం వల్ల కలిసి మెలిసి ఉండే గుణాన్ని పెంపొందిస్తాడు. 

 

మామిడి ముక్కలు: వీటిలో తీపి, పులుపు గుణాలతో పాటు వగరు గుణముంటుంది. చర్మం ఆరోగ్యవంతంగా ముడుతలు పడకుండా నునువుగా ఉండటానికి మామిడిలోని లక్షణాలు ఉపకరిస్తాయి. విపరీతమైన చలి తర్వాత వేడితో పెదవులు పగులటం, చర్మం బీటలు వారడం-ఇటువంటి లక్షణాలను మామిడిలోని వగరు నివారిస్తుంది. మామిడి ముక్కల్లో ‘సి’ విటమిన్ కూడా ఉంటుంది. దీనివల్ల వల్ల చర్మవ్యాధుల రాకుండా నిరోధించుకోగలుగుతాం.

 

చింతపండు: మామిడి ముక్కలతో కలిసి చింత పులుపు మరింత ఆలోచనా శక్తిని పెంచి, మనిషిని సన్మార్గంలో నడిపిస్తుంది. ఫలితంగా టెన్షన్, హడావుడి లేని జీవితాన్ని గడుపగలం. ఈ పులుపు వేసవిలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

 

అరటి: అరటి శరీరానికి అవసరమైన సమగ్ర పౌష్టికాహారాన్ని అందిస్తుంది.

 

చెరుకు: చెరుకు రక్తశుద్ధికి, ఉత్తేజానికి చెరుకులోని పీచుపదార్థం ఉపకరిస్తుంది.

 

ఉప్పు, కొబ్బరిముక్కలు: శారీరక రుగ్మతలను తొలగించడానికి ఇవి రెండు ఎంతగానో సహకరిస్తాయి.

 

షడ్రుచులు – వాటి అర్థాలు

Image result for ugadi pachadi

పచ్చడిలో ఉండే ఒక్కొక్క రుచి ఒక్కొక భావానికి, అనుభవానికి ప్రతీక. తియ్యగా ఉండే బెల్లం ఆనందానికి సంకేతం. పుల్లగా ఉండే పచ్చి మామిడి ముక్కలు కొత్త సవాళ్లను గుర్తుచేస్తాయి. జీవితంలో ఉత్సాహని ఉప్పు ప్రతీక. బాధకలిగించే అనుభవాలకు వేప పువ్వు. చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులను గుర్తుచేస్తుంది. మిరపపొడి కారం సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులను గుర్తుచేస్తుంది.