కిలకిల కోయిల సడిలా... ఉగాది పాట వచ్చేసింది.. - MicTv.in - Telugu News
mictv telugu

కిలకిల కోయిల సడిలా… ఉగాది పాట వచ్చేసింది..

April 1, 2022

తెలుగు ప్రజల కొత్త సంతవ్సరాది ఉగాది సంబరాలు మొదలయ్యాయి. పండగలకు తన పాటలతో వన్నె తెచ్చే మైక్ టీవీ ఈ ఉగాది కోసం ఎస్వీకేఎస్ మూవీస్, ఎన్‌వీఎల్ ఆర్ట్స్ సంస్థలతో కలసి ఓ వీడియో పాటను తీసుకొచ్చింది..
‘‘కిల కిల కోయిల సడిలా
పులకింతల నవ్వుల జడిలా
తొలిపండగిలా తరలొచ్చెనిలా
తెలుగిళ్లకు ఈ వేళ…
గడపల పసుపుల తడిలా’

పలు మమతలు కట్టిన గుడిలా…’ అంటూ పండగ ఆత్మను అద్భుతంగా ఆవిష్కరించిందీపాట. మామాడిడాకులు, పండివంటలు, పంచాంగ శ్రవణం వంటి ఉగాది విశేషాలన్నింటిని ఇందులో కనువిందుగా చూపారు. శ్రీరాం తపస్వి రాసిన ఈ పాటను సాయిచరణ్, బృంద ఆపించారు. త్రినాథ్ మంతెన సంగీతం సమకూర్చారు.
చాగర్లమూడీ వంశీధర్, నండూరి రాము ఈ పాటకు నిర్మాతగా వ్యవహరించగా తన్విత చాగర్లమూడి సమర్పించారు. దర్శకత్వం మహేశ్ బంటు, నృత్యం జోజో మాస్టర్, డీఓపీ వేణుగోపాల్ ఉత్పల. ధీరన్ చాగర్లమూడి, ధ్రువ్ దాసరి, కార్తీక దాసరి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా, బాలాజీ శ్రీను లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఇందులో రాజకీశేఖర్, ధన బళ్ల, నండూరి రాము, స్కైలాబ్ నాయుడు, గోవింద్ శ్రీనివాస్, సంపంగి రాజేశ్వరి, పెద్దిరాజు, మాధురి, అరుణ కుమారి, లక్ష్మణ్ చౌదరి, కావేరి వాల్మీకి, లక్కీ, నర్సమూర్తి రాజు, బేబీ దేదీప్య, బీబీ హేమలక్ష్మి, మౌనిక తదితరులు నటించారు.