UGC allowed foreign universities in india
mictv telugu

విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. విదేశీ వర్సిటీలకు అనుమతిచ్చిన యూజీసీ

January 5, 2023

యూజీసీ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ వర్సిటీలు దేశంలో క్యాంపస్‌లు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతిచ్చింది. ఈ మేరకు రూపొందించిన ముసాయిదా నియమావళిని విడుదల చేసింది. నూతన విద్యావిధానం – 2020 కి అనుగుణంగా దేశంలో విదేశీ వర్సిటీల కార్యకలాపాలకు నేరుగా అనుమతిస్తున్నట్టు చైర్మన్ జగదీష్ కుమార్ వెల్లడించారు. అడ్మిషన్ ప్రక్రియ, ఫీజు నిర్ణయించడం, నిధులను స్వదేశానికి పంపడం వంటి అవకాశాలను కల్పించింది. ఆఫ్ లైన్ విధానంలో ఫుల్ టైం కోర్సులను మాత్రమే అందించాలని, ఆన్ లైన్, దూరవిద్య కోర్సులను వీలు లేదని స్పష్టం చేసింది. దేశ ప్రయోజనాలను దెబ్బతీసే కోర్సులను ఎట్టి పరిస్థితుల్లోనూ విదేశీ వర్సిటీలు అందించరాదని షరతు విధించింది. మొదట 10 ఏళ్లు మాత్రమే పర్మిషన్ ఇస్తామని తర్వాత నిబంధనలన్నీ పాటిస్తే 9వ ఏట అనుమతులు రెన్యువల్ చేస్తామని చైర్మన్ వివరించారు. బోధనా సిబ్బందిని భారత్ లేదా విదేశాల నుంచి కూడా నియమించుకోవచ్చని, నిధుల బదిలీలు ఫెమా నిబంధనలకు లోబడి ఉండాలని తేల్చి చెప్పింది.