UGC NET Results will be released tomorrow
mictv telugu

రేపు యూజీసీ నెట్ ఫలితాల విడుదల.. ఇలా చెక్ చేసుకోండి

November 4, 2022

పీహెచ్‌డీలో చేరేందుకు లేదా అధ్యాపక వృత్తి చేపట్టేందుకు రాసే నెట్ పరీక్ష ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. యూజీసీ నిర్వహించే ఈ పరీక్షను ఈ ఏడాది నాలుగు విడతలుగా నిర్వహించారు. తొలి విడత జులై 9 నుంచి జులై 12 వరకు, రెండో విడత సెప్టెంబర్ 20 నుంచి 23 వరకు, మూడో విడత సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 4 వరకు, నాలుగో విడత అక్టోబర్ 8 నుంచి 14 వరకు నిర్వహించారు. లక్షలాది మంది అభ్యర్ధులు హాజరైన ఈ పరీక్ష ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తాజాగా విడుదల చేసింది. అభ్యర్ధులు ఫలితాల కోసం అధికారిక వెబ్ సైట్ https://ugcnet.nta.nic.in/లో చూసి తెలుసుకోవచ్చు.