UGC released the list of fake universities in the country
mictv telugu

ఏపీ సహా దేశంలో ఉన్న ఫేక్ యూనివర్సిటీల లిస్ట్ విడుదల చేసిన యూజీసీ

August 26, 2022

యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ దేశంలో ఉన్న ఫేక్ యూనివర్సిటీల లిస్ట్ బయటపెట్టింది. వీటిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వర్సిటీ కూడా ఉంది. కమిషన్ చట్టం – 1956కు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న 21 వర్సిటీల లిస్టును శుక్రవారం వెల్లడించింది. ఈ వర్సిటీలు విద్యార్ధులకు డిగ్రీలు ఇచ్చే అర్హత లేదని, విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు గమనించాలని కోరింది. ఢిల్లీలో 8, ఉత్తరప్రదేశ్‌లో 4, పశ్చిమ బెంగాల్, ఒడిషాలలో 2, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లలో ఒకటి చొప్పున ఫేక్ వర్సిటీలు ఉన్నాయని పేర్కొంది. ఆ ఫేక్ వర్సిటీల వివరాలు ఇలా ఉన్నాయి.
ఢిల్లీ: కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్, ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్ సైన్సెస్ (AIIPPHS), యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ, ఏడీఆర్(ADR)-సెంట్రిక్ జ్యూరిడికల్ యూనివర్సిటీ, వొకేషనల్ యూనివర్సిటీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అధ్యాత్మిక్ విశ్వవిద్యాలయ (స్పిరిట్చువల్ యూనివర్సిటీ), విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్.
ఉత్తరప్రదేశ్‌: గాంధీ హిందీ విద్యాపీఠం, నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూనివర్సిటీ, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి, భారతీయ శిక్షా పరిషత్.
ఒడిశా: నార్త్ ఒరిస్సా అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ, నవభారత్ శిక్షా పరిషత్ యూనివర్సిటీ.
వెస్ట్‌ బెంగాల్‌: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్.
కర్ణాటక: బడగన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సొసైటీ ఆఫ్ కర్ణాటక.
కేరళ:సెయింట్ జాన్స్ యూనివర్సిటీ- కిషనట్టం
మహారాష్ట్ర: రాజా అరబిక్ యూనివర్సిటీ- నాగ్‌పూర్
పుదుచ్చేరి: శ్రీ బోధి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్
ఆంధ్రప్రదేశ్‌: క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ‌