బూతుకు, అశ్లీలానికి మారుపేరుగా బాలీవుడ్ ! - MicTv.in - Telugu News
mictv telugu

బూతుకు, అశ్లీలానికి మారుపేరుగా బాలీవుడ్ !

August 16, 2017

బాలీవుడ్ సినిమాల్లో ఇక నుండీ బూతు మాటలు, పోర్న్ దృశ్యాలు విచ్చలవిడిగా కనిపిస్తాయి అంటున్నాడు CBFC మాజీ అధ్యక్షుడు పహ్లాజ్ నిహ్లానీ. తను సెన్సార్ బోర్డు అధ్యక్షుడిగా దిగిపోయాడు గనక ఈ మాట అంటున్నాడని విమర్శలు వినిపిస్తున్నాయి. ‘ ఉడ్తా పంజాబ్ ’ సినిమా విషయంలో పహ్లాజ్ నిహ్లానీ చాలా ఘాటుగా కత్తెరలు విధించాడు. అప్పుడు అతని మీద బాలీవుడ్ యావత్తు అభ్యంతరకర వాయిస్ ను వినిపించింది. కొన్ని రాజకీయ ఒత్తిళ్ళ కారణంగా సడెన్ గా పహ్లాజ్ నిహ్లానీ సెన్సార్ బోర్డు అధ్యక్ష పదవికి బై బై చెప్పాల్సి వచ్చింది. ప్రస్తుతం అతని ప్లేసులోకి ప్రసూన్ జోషి వచ్చాడు. సినిమాలు మనుషుల జీవితాల మీద అత్యంత ప్రభావం చూపుతాయి. సినిమాల నుండి మన సంస్కృతిని కాపాడ్డానికి వున్న ఏకైక ఆయుధం సెన్సారే. అలాంటి సెన్సార్ దేనికో, ఎవరికో లోబడితే సినిమాలు ఇష్టారాజ్యంగా వచ్చేస్తాయి. జనాల బుర్రలు పాడు చేస్తాయి.

అలా గనక సెన్సార్ లూజుగా వ్యవహరించిందంటే ఆ సెన్సార్ వున్నా వొకటే.. లేకపోయినా వొకటే. అశ్లీలం బాలావుడ్ తెర మీద ఎప్పుడెప్పుడు తైథక్కలాడాలీ అని ఉగ్గబట్టుకొని వుంది. ఇంక ఆ సెన్సార్ యొక్క అడ్డు గోడలు తొలగిపోయినట్టేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పదవి పోవడం వల్లే ఆయనిలా మాట్లాడుతున్నాడని అంటున్నారు కొందరు. ఇక బాలీవుడ్ అయితే ‘ ప్రేక్షకులు కోరింది మేము ఇస్తున్నాం ’ అంటోంది. ప్రేక్షకులు మాకిది కావాలని కోరరు. బాగున్నదాన్ని ఆదరిస్తారు అంతే. దాన్ని వాళ్ళలా అర్థం చేస్కొని విచ్చలవిడి తనాన్ని సినిమాల్లో జొప్పిస్తున్నారు. అది రాంగని కత్తెరలు విధించిన సెన్సార్ ను బదనాము చేస్తున్నారు. అసభ్యకర దృశ్యాలు చూపడం వల్ల ఆ ప్రభావం సినిమా చూస్తున్న ప్రేక్షకుల మీద తప్పకుండా పడుతుంది. వాళ్ళు రేపు అలాంటి పనులు చెయ్యటానికి సినిమా అనేది వాళ్ళకు ఒక రెచ్చగొట్టే ఉత్ర్పేరకమవుతుందని ఎప్పుడు తెలుసుకుంటారో ? అని తన బాధని పంచుకున్నాడు. కానీ బాలీవుడ్ హాలీవుడ్ స్థాయిని అందుకోవాలనే కుతూహళంలో వుంది గాబట్టి అది రెచ్చిపోక తప్పదంటారు బాలీవుడ్ బంగారయ్యలు.

 

https://ujjawalprabhat.com/%E0%A4%AC%E0%A5%89%E0%A4%B2%E0%A5%80%E0%A4%B5%E0%A5%81%E0%A4%A1-%E0%A4%AE%E0%A5%87%E0%A4%82-%E0%A4%85%E0%A4%AC-%E0%A4%96%E0%A5%81%E0%A4%B2%E0%A4%95%E0%A4%B0-%E0%A4%9A%E0%A4%B2%E0%A5%87%E0%A4%82/101610/