ఘోరం.. వాడేసిన కండోమ్స్‌ను కడిగి అమ్మేస్తున్నారు..  - MicTv.in - Telugu News
mictv telugu

ఘోరం.. వాడేసిన కండోమ్స్‌ను కడిగి అమ్మేస్తున్నారు.. 

September 24, 2020

Ugly rocket in Vietnam

కండోమ్స్ మంచివే. మనుషులే మంచోళ్లు కారు!  పైసల కోసం అత్యంత దారుణానికి తెగబడుతున్నారు. తోటి మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వాడేసిన కండోములను మళ్లీ జనానికి అంటగడుతున్నారు. వియత్నాంలో ఈ దారుణం జరుగుతోంది. లక్షల కొద్దీ వాడేసిన వాటిని కడిగి మళ్లీ ప్యాక్ చేసి అమ్ముతున్న రాకెట్ బయట పడింది. 

బిన్ దువాంగ్‌లోని ఫ్యాక్టరీలో ఈ ఘోరం జరుగుతున్నట్లు ఉప్పందుకున్న పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. 3.2 లక్షల యూజ్డ్ కండోములను స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఫ్యాక్టరలో ‘శుభ్రంగా’ కడిగి రీప్యాక్ చేస్తున్నారని దర్యాప్తులో తేలింది. ఫ్యాక్టరీ యజమాని ఎవరో తెలుసుకుని మరింత షాక్ తిన్నారు. పామ్ తిన్ తాన్ గోక్ అనే మహిళ ఈ వ్యాపారం నిర్వహిస్తోంది. ఆమె కొంతమంది వర్కర్ల సాయంతో వాడేసిన కండోములను కడిగి, ఆరబెట్టి, కర్రల సాయంతో తిరిగి సరైన ఆకారంలో ఉంచి ప్యాక్ చేయిస్తోంది. వీటిని వాడిన వారికి సుఖరోగాలు, ఇతర వైరస్ సోకే ప్రమాదం ఉందని, ప్రజుల కండోమ్స్‌ను వాడే సమయంలో వాటి నాణ్యతను పరిశీలించాలని పోలీసులు కోరుతున్నారు. విషయం తెలుసుకున్న విదేశీ టూరిస్టులకు దిమ్మదిరిగిపోతోంది.