మాస్కులు నచ్చలేదు..‌ పామును చుట్టుకున్నాడు - MicTv.in - Telugu News
mictv telugu

మాస్కులు నచ్చలేదు..‌ పామును చుట్టుకున్నాడు

September 16, 2020

vvd

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జన సమూహాల్లో ఫేస్ మాస్క్ ధరించడం తప్పనిసరి అయింది. వైరస్ నుంచి తమను తాము కాపాడుకోవడానికి ప్రజలు మాస్క్ లు ధరిస్తున్నారు. ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా మాస్కులకు డిమాండ్ పెరిగిపోయింది. కొత్త కొత్త డిజైన్లతో మాస్కులు మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వస్తున్నాయి. కొందరైతే తాము ధరించిన బట్టలకు మ్యాచింగ్ మాస్కులను వాడుతున్నారు. ఎన్ని రకాల మాస్కులు వచ్చిన ఓ వ్యక్తికి నచ్చనట్టు ఉన్నాయి. ఏకంగా ముఖానికి పామును చుట్టుకుని తిరుగుతున్నాడు. 

బస్సులో కూడా పాముతోనే తిరుగుతున్నాడు. ఈ వింత సంఘటన ఇంగ్లాండ్‌లోని గ్రేటర్ మాంచెస్టర్‌ నగరంలో జరిగింది. ఓ వ్యక్తి కొండ చిలువను మెడలో వేసుకొని దాన్ని ముక్కుకు అడ్డుపెట్టుకొని సాల్‌ఫోర్డ్‌లోని స్వింటన్ నుంచి మాంచెస్టర్ సిటీ సెంటర్‌కు వెళ్లే బస్సు ఎక్కాడు. దీంతో తోటి ప్రయాణికులు ఒక్కసారిగా షాకయ్యారు. అతని పక్కన కూర్చోకుండా దూరం వెళ్లి కూర్చున్నారు. బస్సు కొంచెం దూరం ప్రయాణించాక పామును మెడలో నుంచి తీసి తన ముందున్న హ్యాండ్ రెయిల్స్‌కు చుట్టాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో అతడిపై చర్యలు తీసుకున్నారు. పామును మాస్క్ లాగా వినియోగించకూడదని హెచ్చరించారు.