5జీ టెక్నాలజీకి చెక్.. చైనాకు మరో షాక్ - MicTv.in - Telugu News
mictv telugu

5జీ టెక్నాలజీకి చెక్.. చైనాకు మరో షాక్

July 5, 2020

UK PM Johnson to phase out Huawei’s 5G role within months

దేశ భద్రతకు ముప్పు పొంచి ఉన్న క్రమంలో 59 చైనా యాప్స్‌ను భారత్ తొలగించగా.. ఇప్పుడు వివిధ దేశాలు భారత్ బాట పట్టాయి. తాజాగా అమెరికా కంపెనీ యాపిల్ కూడా తన యాప్ స్టోర్ నుంచి 4,500 చైనా మొబైల్ గేమ్స్ యాప్స్‌ను తొలగించింది. ఇప్పుడు ఈ బాటలోకి బ్రిటన్ ప్రభుత్వం కూడా వస్తోంది. దేశంలో 5జీ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్న చైనా కంపెనీ హువావేకు చెక్ పెట్టాలనే నిర్ణయానికి వచ్చింది. ఇప్పటివరకూ అమర్చిన హువావే కంపెనీ పరికరా‌లను తొలగిండచడానికి నిర్ణయం తీసుకుంది. మరో ఆరు నెలల్లో బ్రిటన్‌లో పూర్తిగా ఆ కంపెనీ సేవలను నిలిపివేసేందుకు సిద్ధం అవుతోంది.

చైనా టెక్నాలజీ వల్ల దేశానికి ముప్పు పొంచి ఉందని బ్రిటన్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఇటీవల ఓ అంచనాకు వచ్చింది. ఈ క్రమంలో హువావేపై అమెరికా ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ ఆంక్షలతో అమెరికా సంస్థల టెక్నాలజీ చైనా కంపెనీలకు దొరకకుండా అమెరికా గట్టి చర్యలు తీసుకుంది. హువావే ఎవరీకీ తెలియని ఓ కొత్త టెక్నాలజీని బ్రిటన్‌లో వినియోగిస్తే అది దేశ భద్రతకు పెద్ద ముప్పని సైబర్ సెక్యూరిటీ సెంటర్ భావిస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన ఓ నివేదికను త్వరలో బ్రిటన్ ప్రధానికి అందించనుంది.