uk pm rishi sunak hosts traditional feastfor office staff
mictv telugu

బ్రిటన్ పీఎం కార్యాలయంలో పొంగల్ విందు

January 18, 2023

 uk pm rishi sunak hosts traditional feastfor office staff

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తన భారతీయతను మరోసారి చాటుకున్నారు. సంక్రాంతికి కార్యాలయ సిబ్బంది అందరికీ పొంగల్ లంచ్ పెట్టారు. అది కూడా అరిటాకుల్లో. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ట్విట్టర్ లో ఎక్కువ మంది దీన్ని చూశారు.

లండ‌న్ 10 డౌనింగ్ స్ట్రీట్‌లో రిషీ సునాక్ ఏర్పాటు చేసిన పొంగ‌ల్ లంచ్‌ను ఆయ‌న కార్యాల‌య సిబ్బంది ఆస్వాదించ‌డం క‌నిపించింది. అర‌టి ఆకుల్లో ఆహార ప‌దార్ధాల‌ను వ‌డ్డించ‌గా సంప్ర‌దాయ దుస్తుల‌ను ధ‌రించిన వ్య‌క్తులు స‌ర్వ్ చేశారు.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా సంక్రాంతిని జ‌రుపుకుంటున్న వారంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలియ‌చేస్తున్నాన‌ని, ఈ ప‌ర్వ‌దినాన ప్ర‌తి ఒక్క‌రికీ సుఖ సంతోషాలు చేకూరాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాన‌ని రిషీ సునాక్ వీడియో సందేశంలో తెలిపారు.