కరోనా నుంచి కాపాడిన దేవుళ్ల పేర్లే బిడ్డకు పెట్టుకున్నారు
కరోనా సంక్షోభంలో పుట్టిన పిల్లలకు కరోనా, కోవిడ్ అని పేర్లు పెట్టుకోవడం చూస్తున్నాం. కొందరు తమ ఇష్ట దైవాల పేర్లు, తమ పెద్దల పేర్లు పెట్టుకుంటారు. కానీ, ఓచోట మాత్రం కరోనా మహమ్మారి నుంచి తమ బిడ్డను కాపాడిన ఇద్దరు వైద్యుల పేర్లను ఆ బిడ్డకు పెట్టుకున్నారు. వారెవరో కాదు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ దంపుతులు. బోరిస్ కాబోయే భార్య క్యారీ సైమండ్స్ తమ కుమారునికి విల్ ఫ్రెడ్ లారీ నికోలస్ జాన్సన్ అనే పేరు పెట్టారు. ఈ పేరు పెట్టడానికి గల కారణాన్ని వారు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.
గత నెలలో జాన్సన్‌కు కరోనా సోకింది. జాన్సన్ ప్రాణాలు కాపాడటంలో ఇద్దరు వైద్యులు తీవ్రంగా శ్రమించారు. చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. బాబును కాపాడే పూచీ మాదని వారికి భరోసా ఇచ్చారు. కరోనా సోకి అతను బతకడేమోనని ఆ దంపతులు ఎంతో బాధపడ్డారు. అయితే సదరు వైద్యులు అన్నట్టుగానే మాట నిలబెట్టుకున్నారు. జాన్సన్ కరోనా నుంచి పూర్తిగా కోలుకునేలా చేశారు. దీంతో బోరిస్ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కరోనా సంక్షోభంలో వైద్యులే ప్రత్యక్ష దేవుళ్లు అందుకే .. తమకు పుట్టిన బిడ్డకు వారి పేర్లు పెట్టుకుని రుణం ఇలా తీర్చుకున్నామన్నారు. జాన్సన్‌ను కాపాడిన ఆ వైద్యుల పేర్లను కలగలిపి తన కుమారునికి పెట్టినట్లు సైమండ్స్ వెల్లడించారు. విల్‌ఫ్రెడ్ జాన్సన్‌కు అతని తాత లారీ పేరు ముందుగా జత చేశామన్నారు. ఉదయం 9 గంటల సమయంలో విల్ ఫ్రెడ్ జన్మించాడని, ఎన్‌హెచ్ ఎస్ మెడికల్ స్టాఫ్ తనను, తన కుమారుడిని జాగ్రత్తగా చూసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు తానెంతో ఆనందంగా ఉన్నానని తెలిపారు.