రిషి సునాక్ సంచలన ప్రసంగం..బ్రిటన్‌ని సంక్షోభం నుంచి బయటపడేస్తారా? - MicTv.in - Telugu News
mictv telugu

రిషి సునాక్ సంచలన ప్రసంగం..బ్రిటన్‌ని సంక్షోభం నుంచి బయటపడేస్తారా?

October 25, 2022

బ్రిటన్‌ని సంక్షోభం నుంచి ప్రధాని రిషి సునాక్ బయటపడేస్తారా?ఆర్థిక పరిస్థితులు చక్కదిద్దుతారా?బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న రిషి సునాక్ ముందున్న సవాళ్లు ఏంటి?తొలి ప్రసంగం ఎలా ఉంది. రిషి సునాక్ తీసుకోబోయే కఠిన నిర్ణయాలు ఏంటి?

తొలి ప్రసంగం

బ్రిటన్ ప్రధానిగా బాధ్యతులు స్వీకరించిన భారత మూలాలు వున్న రిషి సునాక్ తొలిరోజే సంచలన ప్రసంగం చేశారు. రాబోయే రోజుల్లో కఠిన నిర్ణయాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అప్పుల భారాన్ని భావి తరాలపై వేయబోనని స్పష్టం చేశారు. లిజ్ ట్రస్ చేసిన తప్పిదాల్ని సరిచేయడానికి ప్రధానిని అయ్యానని రిషి సునాక్ చెప్పారు.

ఆల్ ది బెస్ట్ చెప్పిన లిజ్ ట్రస్

లండన్ బకింగ్ హమ్ ప్యాలెస్ లో కింగ్ చార్లెస్ IIIని ప్రధాని రిషి సునాక్ కలిశారు. అంతకుముందు లిజ్ ట్రస్ ప్రధానిగా చివరి ప్రసంగం చేశారు. కష్టకాలంలో ఉన్న బ్రిటన్ త్వరలోనే కోలుకుంటుందని ఆమె అన్నారు. బ్రిటన్ ప్రధానిగా కొత్తగా ఎన్నికైన రిషి సునాక్ కు ఆమె ఆల్ ది బెస్ట్ చెప్పారు. పుతిన్ పై ఉక్రెయిన్ ధైర్యంగా పోరాడుతుందని,అందరూ ఆ దేశానికి మద్దతు ఇవ్వాలని కోరారు.

వెయిటర్ నుంచి ప్రధాని దాకాబ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రిషి సునాక్ అత్యంత చిన్న వయస్సుడు. సౌతాంఫ్టన్ లో పుట్టిన రిషి వయస్సు ప్రస్తుతం 42 సంవత్సరాలు. ఆయన తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికా నుంచి ఇంగ్లాండ్‌కు వలస వెళ్లారు. తండ్రి యశ్‌వీర్ డాక్టర్.తల్లి ఫార్మసిస్ట్. రిషి తండ్రి కెన్యాలో పుట్టిపెరిగారు. తల్లి టాంజనియాకు చెందినవారు. వీరి పూర్వీకులు పంజాబ్ ప్రావిన్స్ కు చెందిన వాళ్లు విద్యార్థిగా ఉన్న సమయంలో రిషి సునాక్ సౌతాంఫ్టన్ లో ఓ ఇండియన్ రెస్టారెంట్ లో వెయిటర్ గా పని చేశారు. 2009లో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి కుమార్తె అక్షతామూర్తిని రిషి సునాక్ పెళ్లి చేసుకున్నారు

భారతీయ ఆచారాలంటే ఇష్టం

బ్రిటన్ ప్రధాని అయిన రిషి సునాక్‌కు భారతీయ సంప్రదాయాలు అంటే చాలా గౌరవం. కుటుంబసభ్యులతో కలిసి తరచూ ఆలయాలకు వెళ్తారు. గో మాతకు ప్రత్యేక పూజలు చేస్తారు. బ్రిటన్ కొత్త ప్రధానిగా ఏకగ్రీవంగా ఎన్నికైన రిషి సునాక్ భగవద్గీతపై ప్రమాణం చేశారు. భారతీయమూలాలు వున్న రిషి సునాక్ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. బ్రిటన్‌ని సంక్షోభం నుంచి బయటపడేయడమే అతిపెద్దసవాల్. ఆర్థిక మంత్రిగా పనిచేసిన రిషి సునాక్ మంచి పేరుంది. అప్పట్లో సంక్షోభ సమయంలో తనదైన నిర్ణయాలు తీసుకుని సమర్థంగా పనిచేశారు. ఇప్పుడు అలాగే బ్రిటన్‌ను కష్టాల నుంచి గట్టేక్కిస్తారని అందరూ భావిస్తున్నారు.