విమానం డోర్ తెరిచేస్తానంది.. జైల్లో వేసి డోర్ వేశారు... - MicTv.in - Telugu News
mictv telugu

విమానం డోర్ తెరిచేస్తానంది.. జైల్లో వేసి డోర్ వేశారు…

February 14, 2020

UK woman Jailed for Trying to Open Plane Door   .

విమానం గాల్లో  ఉండగానే విమాన తలుపులు తెరవబోయిన ఓ మహిళకు లండన్ కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించింది. పిచ్చిగా ప్రవర్తిస్తూ ప్రయాణికుల ప్రాణాలకు ముప్పుతెప్పించే విధంగా చేసినందుకు ఈ శిక్షను ఖరారు చేశారు. ఆ సమయంలో ప్రయాణికులు ఎంతో భయాందోళనకు గురై ఉంటారని  అది వారి జీవితంలో మరచిపోని సంఘటనగా న్యాయమూర్తి పేర్కొన్నారు. దీంతో పాటు ఆమె జీవిత కాలం తమ విమానంలో ప్రయాణించే వీలు లేకుండా నిషేదం విధించింది జెట్ 2.కామ్ సంస్థ. 

గతేడాది జూన్ నెలలో  క్లోయి హెయిన్స్‌(26)అనే మహిళ లండన్‌ నుంచి టర్కీకి వెళ్లేందుకు జెట్‌2 విమానంల ఎక్కింది. విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత ఆమె తలుపు తీయబోయింది. వెంటనే అందులో ఉన్న సిబ్బంది. అడ్డుకోబోయారు. అయినా వినిపించుకోకుండా వారిపై కూడా దాడి చేసింది. అంతేకాదు..నేను చావాలనుకుంటున్నా.. మిమ్మల్ని కూడా చంపుతానంటూ కేకలు వేసింది. దీంతో ప్రయాణికులంతా తీవ్రఆందోళనకు గురయ్యారు. వెంటనే విమానం కిందకు దించి ఆమెను అరెస్టు చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో సుమారు 206 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆ సమయంలో విమానంలో 206 మంది ప్రయాణికులున్నారు. అప్పట్లో ఈ  సంఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.