Uk women survives only on digestive biscuits
mictv telugu

ఏం తిన్నా కక్కేస్తుంది.. బిస్కెట్లే ఆమె ఆహారం!

November 18, 2022

ఉదయం బ్రేకఫాస్ట్, మధ్యలో లంచ్, ఆ తర్వాత స్నాక్స్, రాత్రి డిన్నర్ మన రోజువారీ ఫుడ్ టైమ్ టేబుల్. మధ్య మధ్యన ఏవో చిరుతిళ్లు కూడా ఉండనే ఉంటాయనుకోండి. కానీ యూకేకి చెందిన ఈ మహిళకు మాత్రం బిస్కెట్లే ప్రధాన ఆహారం.

మనం ఎన్నెన్నో అనుకుంటాం. కానీ అవేవీ జరుగవంటారు. యూకేకి చెందిన తాల్యా విషయంలో అదే జరుగుతున్నది. ఆమె 80వేల పౌండ్లు సంపాదించే ఉద్యోగం కావాలనుకుంది. కానీ ఆమె ఏం చేయలేని పరిస్థితిలో ఉంది. ఆమె గ్యాస్ట్రోపారాసిస్ అనే ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నది. దీనివల్ల ఎలాంటి ఆహారం తీసుకున్నా వెంటనే వాంతి చేసేసుకుంటుంది.

తాల్యా సమస్యకు గ్యాస్ట్రిక్ పేస్ మేకర్ అవసరం. దానికోసం 80వేల పౌండ్లు అవసరమంటున్నారు ఆమె తల్లిదండ్రులు. ఈ ఫండ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ‘నా జీవితం ఒక చాలెంజ్లాంటిది. నేను ఏదైనా కాస్త ఎక్కువ తిన్నా, తాగినా కూడా వెంటనే వాంతవుతుంది. దాంతో పాటు భరించలేని కడుపునొప్పి కూడా ఉంటుంది. ఈ కండీషన్ వల్ల నేను ఎటూ కదలలేని పరిస్థితిలో ఉన్నాను. మూడు పూటలా ఆ బిస్కెట్స్ తిని బతికేస్తున్నా. అవసరమైన పోషణ కావాలంటే పూర్తిగా ఫీడింగ్ ట్యూబ్ పై ఆధారపడుతున్నా’ అంటున్నది తాల్యా. చిన్నప్పటి నుంచి ఆరోగ్యంగానే ఉంది. కొన్ని సంవత్సరాలు అప్పుడప్పుడు కడుపు నొప్పి వచ్చినా పెద్దగా పట్టించుకోలేదు. 2018లో ఈ సమస్య మరింత పెరిగింది. ఏం తిన్నా వాంతి చేసుకునేది.

దీంతో డాక్టర్లను సంప్రదించింది. వారు గ్యాస్ట్రోపారాసిస్ అని తేల్చారు. డాక్టర్లు కూడా ఈ సమస్యకు పరిష్కారం లేదంటున్నారు. ఇక తాన్యా తండ్రి పీటర్ సిన్నట్ ‘డైజిస్టివ్ బిస్కెట్లే నా కూతురి ప్రధాన ఆహారం. నీళ్లు కూడా ఎక్కువ తీసుకోలేకపోతుంది. ఇప్పటికే ఇతర సమస్యల వల్ల ఒక బిడ్డను పోగొట్టుకున్నాం. మరొకరిని పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేము. ఈ వయసులో మాకు అండగా ఉండాల్సిన అమ్మాయి ఇలా అయిపోవడం మమ్మల్ని చాలా బాధిస్తుంది’ అంటున్నాడు.