తెలుగు సినిమాలో హీరోయిన్‌గా ఉక్రెయిన్ నటి - MicTv.in - Telugu News
mictv telugu

తెలుగు సినిమాలో హీరోయిన్‌గా ఉక్రెయిన్ నటి

March 22, 2022

04

రష్యా దాడులతో జనాల నోట నానుతున్న పేరు ఉక్రెయిన్. యుద్ధంతో ఆ దేశం అతలాకుతలం అవుతున్న వేళ ఓ ఉక్రెయిన్ నటి తెలుగు సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుందనే వార్త అధికారికంగా వచ్చింది. వివరాల్లోకెళితే.. నవీన్ పోలిశెట్టి హీరోగా జాతిరత్నాలు అనే చిత్రాన్ని తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు అనుదీప్.. తన తదుపరి సినిమాను తమిళ హీరో శివకార్తికేయన్‌తో చేయబోతున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రం హీరోకి 20వ ది. ఎస్, ఎస్, థమన్ సంగీత దర్శకుడిగా, సురేష్ ప్రొడక్షన్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, శాంతి టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రం నిర్మితమవుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఉక్రెయిన్ నటి మరియా ర్యాబోషప్కా నటిస్తోంది. ఈ మేరకు చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ, మరియాకు గ్రాండ్ వెక్కమ్ చెప్పింది. మరియా గతంలో ఓ ఇండియన్ వెబ్ సిరీస్‌లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు దక్షిణాది సినిమాలో హీరోయిన్‌గా అవకాశం రావడంతో రాబోయే కాలంలో ఆమెకు మంచి భవిష్యత్తు ఉండే అవకాశం ఉంది.