గత నెల రోజులకు పైగా జరుగుతున్న రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ఎప్పటి వరకు జరుగుతుందో ఉక్రెయిన్ సైన్యం జోస్యం చెప్పింది. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీ లొంగిపోయిన రోజు మే 9 వరకు ఈ యుద్ధం కొనసాగిస్తుందని వెల్లడించింది. ఆరోజును రష్యా ‘విక్టరీ డే’గా జరుపుకుంటుంది. దాంతో అప్పటి వరకు యుద్ధాన్ని కొనసాగించి, ఆరోజున ప్రకటన చేసుకోవాలనే ఆలోచనలో రష్యా ఆర్మీ ఉందని అంచనా వేసింది. ఈ మేరకు ఆ దేశ ఇంటెలిజెన్స్ ప్రకారం ఆర్మీ ఈ ప్రకటన చేసిందని, ది కీవ్ ఇండిపెండెంట్ మీడియా హౌజ్ అనే సంస్థ ట్వీట్ చేసింది. మరోవైపు ఉక్రెయిన్ రష్యాపై తీవ్ర ఆరోపణలు చేసింది. నాలుగు లక్షల పౌరులను రష్యా మాస్కోకు తరలించిదని, వారికి అడ్డం పెట్టుకొని కీవ్ ఆక్రమణకు తె0గిస్తారని ఆరోపిస్తోంది. అందులో పావు భాగం చిన్నపిల్లలు ఉన్నారని చెబుతోంది. కానీ, ఈ ఆరోపణలను రష్యా ఖండించింది.