వైరల్ :రష్యా ల్యాండ్ మైన్ ను చేత్తో తీసి పారేసిన ఉక్రెయిన్ పౌరుడు - MicTv.in - Telugu News
mictv telugu

వైరల్ :రష్యా ల్యాండ్ మైన్ ను చేత్తో తీసి పారేసిన ఉక్రెయిన్ పౌరుడు

March 2, 2022

nhgnghn

సైనిక బలంతో దూసుకు వస్తున్న రష్యా సైనికులతో ఉక్రెయిన్ సైన్యం వీరోచితంగా పోరాడుతుండగా, మరోవైపు ఆ దేశ పౌరులు కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ లోని బెర్డయాన్ స్క్ నగరంలో రష్యన్ సైనికులు అమర్చిన ల్యాండ్ మైన్ను ఓ సాధారణ పౌరుడు తన రెండు చేతులతో తీసి రోడ్డకు దూరంగా విసిరివేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ సమయంలో ఆ పౌరుడు ఏ మాత్రం భయం లేకుండా, సిగరెట్ తాగుతూ.. చాలా నింపాదిగా తన పని కానిచ్చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉంటూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కనీసం బాంబు స్క్వాడ్ కి కూడా సమాచారం ఇవ్వకుండా తమ సైనికులను కాపాడే ఉద్దేశంతో ఆ వ్యక్తి చేసిన పనిని పలువురు ప్రశంసిస్తున్నారు.

 https://www.independent.co.uk/tv/news/ukraine-russia-land-mine-road-b2025026.html