యుద్ధ రంగంలోకి మాజీ మిస్.. ఆయుధాలతో గస్తీ - MicTv.in - Telugu News
mictv telugu

యుద్ధ రంగంలోకి మాజీ మిస్.. ఆయుధాలతో గస్తీ

March 1, 2022

modal

ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్న రష్యాకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఇప్పటికే అధ్యక్షుడు జెలెన్ స్కీ సైనికులతో కలిసి పోరాడుతుండగా.. ప్రజలు సైతం దేశ రక్షణకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో ఉక్రెయిన్ మాజీ మిస్ అనస్తాసియా లెన్నా స్వయంగా ఆయుధాలు చేతబట్టి ఆర్మీ దుస్తులతోఓ భవంతి వద్ద గస్తీ కాస్తున్న ఫోటోను షేర్ చేసింది.

 

దాంతో పాటు శత్రువులను హెచ్చరిస్తూ ఓ క్యాప్షన్ పెట్టింది. అంతేకాకుండా దేశంలో ఉన్న సైన్ బోర్డులను మార్చాలని సూచించింది. తద్వారా రష్యన్ సైనికులు అయోమయానికి గురై తప్పుదారి పడతారని పేర్కొంది. 2015లో మిస్ యూనివర్స్ గా ఎంపికైన అనస్తాసియా మంచి ప్రతిభాశాలి. ఐదు
భాషల్లో మాట్లాడగలదు. మరోవైపు ఇరు దేశాల మధ్య జరిగిన చర్చలు విఫలమవడంతో యుద్ధం కొనసాగుతోంది.