ఆర్మీ విమానం కూలి 25 మంది సైనికుల దుర్మరణం - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్మీ విమానం కూలి 25 మంది సైనికుల దుర్మరణం

September 26, 2020

nvgb n

ఆర్మీ విమానం కుప్పకూలి 25 మంది సైనికులు దుర్మరణం చెందారు. ఉక్రెయిన్ లో శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘోర విషాదం చోటుచేసుకుంది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. సైనికులను మరో చోటుకు తరలిస్తుండగా ఖర్ కీవ్ ప్రాంతంలో ఇది జరిగింది. ఈ సంఘటన తమ ఆర్మీకి తీవ్ర విషాదం మిగిల్చిందన్నారు. పలువురు విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంపై విచారం జరుపుతున్నారు. 

ఇంజన్ లో సాంకేతిక లోపం తలెత్తి ఫెయిలవ్వడం వల్ల ఒక్కసారిగా కుప్పకూలిపోయిందని ప్రాసిక్యూటర్ జనరల్ చెప్పారు. ఆ సమయంలో విమానంలో 28 మంది ఉన్నారని అన్నారు. వీరిలో 21 మంది సైనికులు కాగా, మరో ఏడుగురు విమాన సిబ్బంది. ప్రమాద విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారని తెలిపారు.ఈ దుర్ఘటన లో 30 ఏళ్ల ఎయిర్ క్రాఫ్ట్ కమాండర్ కూడా చనిపోయాడు.