మగవాళ్లనూ వదలని రష్యన్ కామాంధులు - MicTv.in - Telugu News
mictv telugu

మగవాళ్లనూ వదలని రష్యన్ కామాంధులు

May 4, 2022

రష్యా ఉక్రెయిన్​ యుద్ధంతో ఎన్నో దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉక్రెయిన్​లో రష్యా సైనికులు అరాచకాలు సృష్టిస్తున్నారు. అక్కడి మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నట్లు ఎన్నో వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా ఆ మాన‌వ మృగాలు.. కేవలం మహిళలనే కాకుండా పురుషులు, బాలురపైనా అత్యాచారం జ‌రుపుతున్నార‌ని స‌మాచారం. వీటికి సంబంధించి ఇప్పటికే డజనుకుపైగా కేసులను గుర్తించినట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ప‌క్కా ప్లాన్ ప్రకారం ఉక్రెయిన్ ప్ర‌జ‌ల‌ను భయభ్రాంతులకు గురిచేయాలనే ఇలాంటి దారుణాల‌కు తెగ‌బ‌డుతుంద‌ని, దీనిపై త‌మ‌కు స్పష్టమైన ఆధారాలు అందాయ‌ని ఐరాస పేర్కొంది. అత్యాచారం నుంచి బ‌య‌ట‌ప‌డ్డ పురుషులు ఆ నేరం గురించి బ‌య‌ట‌కు వెల్ల‌డించ‌లేక‌పోతున్నార‌ని , అయిన‌ప్ప‌టికీ దోషుల‌కు శిక్ష ప‌డాలంటే బాధితులు దైర్యంగా ముందుకు రావ‌ల‌ని ఐరాస విభాగ ప్రత్యేక ప్రతినిధి ప్రమీలా ప్యాటెన్ అన్నారు.