‘పొట్టోణ్ని పొడుగోడు కొడితే పొడుగోణ్ని పోశమ్మ కొట్టింద’ని సామెత. పోశమ్మ సంగతి పక్కనబెడితే పొట్టి ఉక్రెయిన్ను చావకొడుతున్న పొడవు రష్యాకు పొట్టోడి డ్రోన్లు చుక్కలు చూపుతున్నాయి. యద్ధంలో భారీగా దెబ్బతింటున్న ఉక్రెయిన్ వాటం చూసి రష్యాపై దిమ్మదిరిగే దాడులు చేస్తోంది. ముఖ్యంగా చిట్టిపొట్టి డ్రోన్ల దాడులతో రష్యా గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. తాజగా సరిహద్దులోని రష్యా ఆయిల్ రిఫైనరీపై ఉక్రెయిన్ జరిపిన బాంబు దాడి పిల్లకాకి కొడుతున్న ఉండేలు దెబ్బ తీవ్రత ఎంతో కళ్లకు కడుతోంది.
సరిహద్దులోని రష్యా భూభాగంలో ఉన్న నొవోషాక్తిన్స్క్ ఆయిల్ రిఫైనరీవైపు వెళ్లిన ఉక్రెయిన్‌కు చెందిన కమికేజ్ డ్రోన్ చప్పుడు కాకుండా దానిపై ఢామ్మని పడిపోయింది. క్షణంలో ఫ్యాక్టరీలో పెద్ద పేలుడు సంభవించి మంటలు లేచాయి. దట్టమైన పొగ పైకి లేచింది. అంతకంతకు మంటలు పెరుగుతుండంతో సహాయక సిబ్బంది నీళ్లు చల్లడం మొదలుపెట్టారు. ఈ దృశ్యాలను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. డ్రోన్ వస్తున్నప్పుడు రష్యన్లు నవ్వుకోవడం, పేలిపోయాక భయంతో ‘పారిపోదాం పరిగెత్తండి..’ అని అనడం వీడియోలో వినిపిస్తోంది.
Locals in shock as a small Ukrainian drone bombs a Russian oil refinery.
Novoshakhtinsky oil refinery, Rostov Region. pic.twitter.com/mFR0BzXSzm
— Jay in Kyiv (@JayinKyiv) June 22, 2022