రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్లో బుధవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆ దేశ ఎమర్జెన్సీ సేవల విభాగానికి చెందిన ఓ హెలికాప్టర్ కూలి హోంమంత్రి సహా 18 మంది దుర్మరణం పాలయ్యారు. రాజధాని కీవ్కి ఈశాన్య దిక్కున 20 కిలోమీటర్ల దూరాన ఉన్న బ్రోవరీ పట్టణంలోని కిండర్ గార్డెన్ స్కూలు సమీపంలో హెలికాప్టర్ ప్రమాదవశాత్తు కూలిపోయింది. దీనికి పొగమంచు, వెలుతురు లేమిని కారణంగా చెప్తున్నారు.
మరణించిన వారిలో ఇద్దరు పిల్లలు ఉండగా, దేశ హోం మంత్రి డెనిస్ మోనాస్టిస్కీ సహా ఆ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు చనిపోయారని నేషనల్ పోలీస్ అధిపతి ఐగర్ క్లైమెంకో ధృవీకరించారు. హెలికాప్టర్ కూలిన వెంటనే మంటలు పెద్ద ఎత్తున చెలరేగగా, అందుకు సంబంధించిన వీడియో నెట్టింట ప్రత్యక్షమైంది. అటు పాఠశాలలో ఉన్న విద్యార్ధులను హుటాహుటిన వేరే ప్రాంతానికి సురక్షితంగా తరలించారు. కాగా, ప్రమాదం సంభవించిన బ్రోవరీ పట్టణాన్ని ఇటీవల రష్యా ఆక్రమించేందుకు యత్నించగా, ఉక్రెయిన్ తీవ్రంగా ప్రతిఘటించి సమర్ధవంతంగా నిలువరించగలిగింది.
🇺🇦🚁🔥A kindergarten destroyed as a result of a helicopter crash pic.twitter.com/WZx2Bk5ArN
— AZ 🛰🌏🌍🌎 (@AZgeopolitics) January 18, 2023